News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 22 May 2022 22:15 IST
1/27
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్‌ బయలుదేరారు. అక్కడి జ్యూరిక్‌ నగరానికి చేరుకున్న కేటీఆర్‌కు తెలంగాణ ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్‌ బయలుదేరారు. అక్కడి జ్యూరిక్‌ నగరానికి చేరుకున్న కేటీఆర్‌కు తెలంగాణ ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.
2/27
3/27
విదేశాల పర్యటన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం రాత్రి దిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. విదేశాల పర్యటన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం రాత్రి దిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు.
4/27
5/27
రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  ఫోన్‌లో పరామర్శించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత వైద్యుడు సుమన్‌ ఆదివారం సాయంత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రామయ్య ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా పవన్‌ వీడియో కాల్‌ ద్వారా రామయ్యతో మాట్లాడారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో రామయ్య తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని పవన్‌ ఈ సందర్భంగా తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఫోన్‌లో పరామర్శించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత వైద్యుడు సుమన్‌ ఆదివారం సాయంత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రామయ్య ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ వీడియో కాల్‌ ద్వారా రామయ్యతో మాట్లాడారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో రామయ్య తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని పవన్‌ ఈ సందర్భంగా తెలిపారు.
6/27
7/27
విశాఖ పెదవాల్తేరులోని ఆర్‌సీడీ ఆసుపత్రి ఆవరణలో చెట్లు రకారకాల పక్షులకు ఆవాసాలు. వాటికి అక్కడి సిబ్బంది తాగునీరు, తినేందుకు గింజలను వేస్తుంటారు. వీటి కోసం ఉడతలు, గోరింక, కాకి, చిలుకలు, పావురాలు తదితర పక్షులు వస్తుంటాయి. దీంతో ఆసుపత్రి ఆవరణలో జీవ వైవిధ్యం కనిపిస్తోంది. విశాఖ పెదవాల్తేరులోని ఆర్‌సీడీ ఆసుపత్రి ఆవరణలో చెట్లు రకారకాల పక్షులకు ఆవాసాలు. వాటికి అక్కడి సిబ్బంది తాగునీరు, తినేందుకు గింజలను వేస్తుంటారు. వీటి కోసం ఉడతలు, గోరింక, కాకి, చిలుకలు, పావురాలు తదితర పక్షులు వస్తుంటాయి. దీంతో ఆసుపత్రి ఆవరణలో జీవ వైవిధ్యం కనిపిస్తోంది.
8/27
9/27
10/27
సీఎం కేసీఆర్‌ ఆదివారం చండీగఢ్‌లో పర్యటించారు. రైతు చట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను, గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం చండీగఢ్‌లో పర్యటించారు. రైతు చట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను, గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
11/27
12/27
హైదరాబాద్‌లోని ముషీరాబాద్, అంబర్‌పేట, నల్లకుంట ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో సోమవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్, అంబర్‌పేట, నల్లకుంట ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో సోమవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు.
13/27
ముంబయికి చెందిన పదేళ్ల బాలిక రిథమ్‌ మమనియా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపును అధిరోహించి రికార్డు సృష్టించింది. ఇందులో భాగంగా ఆమె 128కిలోమీటర్ల దూరం నడిచింది. ముంబయికి చెందిన పదేళ్ల బాలిక రిథమ్‌ మమనియా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపును అధిరోహించి రికార్డు సృష్టించింది. ఇందులో భాగంగా ఆమె 128కిలోమీటర్ల దూరం నడిచింది.
14/27
15/27
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆసియా జువెల్స్‌ షోకు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ లహరి, సినీ నటి రితిక చక్రవర్తి, మోడల్స్‌ శ్రీలేఖ, సహస్ర తదితరులు పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆసియా జువెల్స్‌ షోకు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ లహరి, సినీ నటి రితిక చక్రవర్తి, మోడల్స్‌ శ్రీలేఖ, సహస్ర తదితరులు పాల్గొని సందడి చేశారు.
16/27
17/27
దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో లంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్‌ను సన్మానించి వీణ జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోష్‌కుమార్‌, నామా నాగేశ్వర్‌రావు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో లంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్‌ను సన్మానించి వీణ జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోష్‌కుమార్‌, నామా నాగేశ్వర్‌రావు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
18/27
కర్ణాటకలోని ముళబాగల్‌ మాజీ శాసనసభ్యుడు జి.మంజునాథ్‌తో పాటు మరో 12మంది కూరగాయల దాతలు రూ.30లక్షల విలువైన లారీని తితిదేకు విరాళంగా అందజేశారు. ఆదివారం ఉదయం ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం కొత్త వాహనాన్ని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి అప్పగించారు. కర్ణాటకలోని ముళబాగల్‌ మాజీ శాసనసభ్యుడు జి.మంజునాథ్‌తో పాటు మరో 12మంది కూరగాయల దాతలు రూ.30లక్షల విలువైన లారీని తితిదేకు విరాళంగా అందజేశారు. ఆదివారం ఉదయం ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం కొత్త వాహనాన్ని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి అప్పగించారు.
19/27
20/27
వరల్డ్ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా డబ్ల్యూఈఫ్‌ వ్యవస్థాపకుడు క్లాస్‌ శ్వాబ్‌తో ఆయన భేటీ అయ్యారు. మే 22 నుంచి 26వరకు డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరగనుంది. వరల్డ్ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా డబ్ల్యూఈఫ్‌ వ్యవస్థాపకుడు క్లాస్‌ శ్వాబ్‌తో ఆయన భేటీ అయ్యారు. మే 22 నుంచి 26వరకు డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరగనుంది.
21/27
బంజారాహిల్స్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌లో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, జబర్దస్త్‌ ఫేమ్‌ ఐశ్వర్య పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌లో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, జబర్దస్త్‌ ఫేమ్‌ ఐశ్వర్య పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు.
22/27
ఉదయగిరి పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం ఏర్పాటు 

చేశారు. ఈ శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కాసేపు సరదాగా ఇలా క్రికెట్ ఆడారు. ఉదయగిరి పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కాసేపు సరదాగా ఇలా క్రికెట్ ఆడారు.
23/27
అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రం గేలార్డ్‌లో టోర్నడో బీభత్సం సృష్టించింది. తీవ్రంగా వీచిన గాలుల కారణంగా పలు చోట్ల ఇళ్లు, నివాస 

సముదాయాలు, కార్లు దెబ్బతిన్నాయి. నాటింగ్‌హామ్‌ ఫారెస్ట్‌ మొబైల్‌ హోమ్ పార్క్‌ ఇలా శిథిలాలతో నిండిపోయింది. అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రం గేలార్డ్‌లో టోర్నడో బీభత్సం సృష్టించింది. తీవ్రంగా వీచిన గాలుల కారణంగా పలు చోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు, కార్లు దెబ్బతిన్నాయి. నాటింగ్‌హామ్‌ ఫారెస్ట్‌ మొబైల్‌ హోమ్ పార్క్‌ ఇలా శిథిలాలతో నిండిపోయింది.
24/27
భారీ తుపాను ధాటికి కెనడా రాజధాని ఒట్టావాలోని మెరివలే రోడ్డులో విద్యుత్ స్తంభాలు ఇలా రహదారిపై ఒరిగిపోయాయి. భారీ తుపాను ధాటికి కెనడా రాజధాని ఒట్టావాలోని మెరివలే రోడ్డులో విద్యుత్ స్తంభాలు ఇలా రహదారిపై ఒరిగిపోయాయి.
25/27
థామస్‌కప్‌ విజేతలు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి ఆట తీరును ప్రధాని అభినందించారు. తెలుగు 

రాష్ట్రాలకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. థామస్‌కప్‌ విజేతలు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి ఆట తీరును ప్రధాని అభినందించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు.
26/27
27/27
హైదరాబాద్‌ వనస్థలిపురం రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహమిది. అన్ని వైపులా దుకాణాలు 

వెలియడంతో విగ్రహం ఉన్నట్లే తెలియడం లేదు. హైదరాబాద్‌ వనస్థలిపురం రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహమిది. అన్ని వైపులా దుకాణాలు వెలియడంతో విగ్రహం ఉన్నట్లే తెలియడం లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు