సాయి పల్లవి
Updated : 21 Dec 2021 19:42 IST
1/22
తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి
2/22
1992 మే 8న తమిళనాడులోని కోటగిరిలో సాయి పల్లవి జన్మించింది.
3/22
సాయి పల్లవి తబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసన్ పూర్తి చేసింది.
4/22
చిన్నప్పటి నుంచి సాయిపల్లవి డ్యాన్స్ అంటే మక్కువ. తన తల్లిలా డ్యాన్సర్ కావాలనుకుంది. అయితే ఎక్కడా శిక్షణ తీసుకోలేదు.
5/22
డ్యాన్సర్‌గా వివిధ టెలివిజన్ కార్యక్రమాలు, రియాల్టీ షోలలో పాల్గొంది. తెలుగులో ‘ఢీ: అల్టిమేట్ డ్యాన్స్ షో(ఢీ4)’లో కంటెస్టెంట్‌గా అదరగొట్టింది.
6/22
నటిగా తమిళంలో ‘కస్తూరి మాన్’, ‘ధమ్ ధూమ్’ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
7/22
మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’లో మలర్ పాత్ర సాయి పల్లవి కెరీర్‌ను మలుపు తిప్పింది.
8/22
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’లో భానుమతిగా నటించి మెప్పించింది.
9/22
నానితో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లోనూ మెరిసింది
10/22
‘కణం’, ‘పడి పడి లేచే మనసు’, ‘మారి2’, ‘ఎన్జీకే’ తదితర చిత్రాలు సాయిపల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.
11/22
శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘లవ్‌స్టోరీ’లో సాయిపల్లవి తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది
12/22
నాని కథానాయకుడిగా ‘శ్యామ్ సింగ్రాయ్’లో దేవదాసీ పాత్రలో నటించింది.
13/22
రానా కీలక పాత్రలో నటిస్తున్న ‘విరాటపర్వం’లో వెన్నెలగా అలరించనుంది.
14/22
‘‘కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి’’
15/22
‘‘అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్ అవుతానా..? తెరపై నన్ను చూసి ‘ఈ పిల్ల ఇలా ఉందేంటి?’ అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని’’
16/22
‘‘ఎవరైనా నన్ను చూస్తే.. నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని. కానీ, ‘ప్రేమమ్’ విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది’’
17/22
‘‘ఎవరైనా క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప.. పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నా. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’
18/22
‘‘నేనిప్పటి వరకు చేసిన గీతాల్లో ‘రౌడీబేబీ’, ‘ఏవండో నాని గారు’ పాటలు కష్టంగా అనిపించాయి’’
19/22
‘‘రీమేక్‌లు చేయకూడదనే రూల్స్ ఏమీ పెట్టుకోలేదు. మాతృక స్థాయిలో చేయాలి లేదా కొత్తగా ఏదైనా చేయాలనే ఒత్తిడి ఉంటుంది. అందుకే దాని బదులు ఓ కొత్త స్క్రిప్ట్ చేస్తే మంచిదనిపిస్తుంది’’
20/22
సాయి పల్లవి చేతికి ఎప్పుడూ జపమాల ఉంటుంది. అది ఆమె తాత ఇచ్చారట. షూటింగ్లలో మాత్రమే దాన్ని తీసి పక్కన పెడతారట.
21/22
‘‘చిరంజీవి సర్ సినిమా(భోళాశంకర్)కి నో చెప్పడానికి కారణం.. అది రీమేక్ అని కాదు. ఆ పాత్రకు న్యాయం చేయలేను అనిపించింది’’
22/22
‘‘ప్రస్తుతానికి నటిగానే కొనసాగుతున్నా. భవిష్యత్తులో వైద్యురాలిగా మారతానేమో. జార్జియాలో వైద్యవిద్య అభ్యసించాను. మన దేశంలో డాక్టర్‌గా సేవలందించడానికి అనుమతి కోసం పరీక్ష రాయాల్సి ఉంది’’
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్‌కుమార్‌రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్‌లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?