పాయల్‌ రాజ్‌పూత్‌
close

పాయల్‌ రాజ్‌పూత్‌

1/28

పాయల్‌ది పంజాబీ కుటుంబం. పుట్టి, పెరిగింది దిల్లీలో. నాలుగేళ్ల వయసులోనే ముఖానికి రంగేసుకుని, పలు పంజాబీ సీరియళ్లలో నటించారు.

2/28

జర్నలిజంలో డిగ్రీ పూర్తయ్యాక యాంకరింగ్‌ చేసింది. కళాశాల రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాతే ఆమెలో సినిమాల్లో నటించాలనే ఆశ పెరిగింది.

3/28

రూ.లక్ష పట్టుకుని సినీ అవకాశాలు వెతుక్కుంటూ తొలిసారి ముంబయిలో అడుగుపెట్టింది.

4/28

తెలుగు, తమిళ చిత్ర సీమల్లో ఎన్నో ఆడిషన్లకు హాజరైంది. ప్రతిచోటా తిరస్కారాలే ఎదురయ్యాయి. కొందరు ఆమె ముఖం దక్షిణాది సినిమాలకు పనికిరాదని చెప్పారు.

5/28

2010లో ‘సప్నోన్ సే భరే నైనా’ ధారావాహికలో ‘సోనాక్షి’గా పనిచేసే అవకాశం లభించింది. ‘ఆఖిర్ బాహు భీ తోహ్ బేటి హీ హై’, ‘గుస్తాక్‌ దిల్‌’, ‘మహాకుంభ్‌’ తదితర సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటించే ఆఫర్‌ దక్కించుకుని, బుల్లితెర నటిగా రాణించింది.

6/28

ఎట్టకేలకు కథానాయికగా పాయల్‌ కెరీర్‌ ఆరంభమైంది. ‘చన్నా మేరేయా’ (2017) అనే పంజాబీ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటిగా (పరిచయం) ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సొంతం చేసుకున్నారు.

7/28

హిందీ సినిమా ‘వీరే కీ వెడ్డింగ్‌’లో చిన్న పాత్రలో కనిపించారు. ఆపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి తీసిన ‘ఆర్‌ఎక్స్‌100’ తెలుగు సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

8/28

తొలిసారి తెలుగు వారిని పలకరించిన పాయల్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆమె చూపులు కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్నాయి. రాత్రికి రాత్రి ఆమె సినీ స్టార్‌ అయిపోయారు. ఉత్తమ నటిగా (అరంగేట్రం) సైమా పురస్కారం అందుకున్నారు.

9/28

‘వెంకీ మామ’ (2019), ‘డిస్కో రాజా’ (2020) సినిమాలతో గుర్తింపు పొందారు.

10/28

ఇటీవల విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’లో డీగ్లామర్‌ లుక్‌, బలమైన పాత్రతో అలరించారు. ఆమె తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించిన ‘ఏంజెల్‌’ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

11/28

‘బుల్లితెర నటిగా ఉన్నప్పుడు నా కెరీర్‌ గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. హీరోయిన్‌ కావాలనేది నా కల.. అది నెరవేర్చుకునే మార్గాలు అప్పట్లో కనిపించలేదు. ఎంతో భయపడ్డాను. ఓ పక్క సీరియల్స్‌లో నటిస్తున్నా, అవి టీవీలో ప్రసారం అవుతున్నాయి. అయినా సరే ఇబ్బందులు పడ్డా’

12/28

‘తెలుగు సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నాకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్‌ ఏర్పడింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’లో నా పాత్ర వల్ల కొందరు నిజ జీవితంలోనూ నన్ను చూసి భయపడుతున్నారు’

13/28

‘నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన అనుభూతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదోక దశలో ప్రేమలో పడే ఉంటారు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి ప్రేమలోపడ్డా. ఇప్పుడు ప్రేమించే తీరకలేదు’

14/28

పాయల్‌ రాజ్‌పూత్‌

15/28

పాయల్‌ రాజ్‌పూత్‌

16/28

పాయల్‌ రాజ్‌పూత్‌

17/28

పాయల్‌ రాజ్‌పూత్‌

18/28

పాయల్‌ రాజ్‌పూత్‌

19/28

పాయల్‌ రాజ్‌పూత్‌

20/28

పాయల్‌ రాజ్‌పూత్‌

21/28

పాయల్‌ రాజ్‌పూత్‌

22/28

పాయల్‌ రాజ్‌పూత్‌

23/28

పాయల్‌ రాజ్‌పూత్‌

24/28

పాయల్‌ రాజ్‌పూత్‌

25/28

పాయల్‌ రాజ్‌పూత్‌

26/28

పాయల్‌ రాజ్‌పూత్‌

27/28

పాయల్‌ రాజ్‌పూత్‌

28/28

పాయల్‌ రాజ్‌పూత్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని