ఫరియా అబ్దుల్లా
close

ఫరియా అబ్దుల్లా

1/15

‘జాతి రత్నాలు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా

2/15

‘‘స్కూల్‌కు వెళ్లేటప్పుడే యాక్టింగ్‌, పెయింటింగ్‌, డ్యాన్స్‌లాంటివి నేర్చుకునేదాన్ని. టెన్త్‌ తర్వాత ఇంటర్మీడియెట్‌కి కాలేజీలో చేరలేదు. హోమ్‌ స్కూలింగ్‌ పద్ధతిలో చదువుకున్నా. ఆ సమయంలో పెయింటింగ్‌ క్లాసులకి కాచీగూడ, సాహిత్యం క్లాసులకు లింగంపల్లి వెళ్లేదాన్ని’’

3/15

‘‘నాటకరంగంపైన ఆసక్తి కలిగింది. ఏడేళ్లుగా నగరంలోని వివిధ నాటక సంస్థల్లో భాగమై ఎన్నో పాత్రలు పోషించాను. కొన్ని నాటకాలు రాయడంతోపాటు దర్శకత్వం వహించాను కూడా.’’

4/15

‘‘లయోలా కాలేజీ నుంచి మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేశా. తర్వాత కొన్నాళ్లకు ఓ కార్యక్రమం కోసం నాగ్‌ అశ్విన్‌ లయోలా కాలేజీకి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసి వెళ్లి కలిశా. ఓ ప్రాజెక్టు చేస్తున్నాం, ఆసక్తి ఉంటే ఆఫీసులో కలవమని చెప్పారు. వెళ్లాక ఆడిషన్‌ చేసి ఎంపికచేశారు.’’

5/15

‘‘నాటకరంగంలో ఏడేళ్ల అనుభవం ఉంది. షార్ట్‌ఫిల్మ్స్‌, వెబ్‌సిరీస్‌లలో నటించాను. ఆ అనుభవం నాకు బాగా పనికొచ్చింది. స్టేజీమీద ప్రదర్శన ఇవ్వడంవల్ల ఏకాగ్రత బాగా అలవడుతుంది. అది నటనకు చాలా అవసరం’’

6/15

ఇంట్లో అందరికీ కళలంటే ఇష్టం. ప్రత్యేకించి నటన, డాన్స్‌ అంటే ప్రత్యేక ఆసక్తి. అయితే వాళ్లలో ఎవరూ బయటకు వచ్చి ప్రదర్శనలు ఇవ్వలేదు, సినిమాల్లో నటించలేదు. నేను కడుపులో ఉన్నపుడు అమ్మ డాన్స్‌ ప్రాక్టీసు చేసేదట. అప్పుడే నాక్కూడా డాన్స్‌పైన ఆసక్తి ఏర్పడిందేమో.

7/15

నిజ జీవితంలో నేను డాన్సర్‌ని. హిప్‌ హాప్‌, బెల్లీ డాన్స్‌, ఫ్రీ స్టయిల్‌ డాన్సింగ్‌ లాంటి పాశ్చాత్య నృత్యాలతోపాటు కథక్‌ కూడా నేర్చుకున్నా. అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌, కవిత్వం కూడా ఇష్టం.

8/15

ఫరియా అబ్దుల్లా

9/15

ఇంట్లో హిందీ, ఉర్దూ మాట్లాడుతుంటాం. ఎప్పట్నుంచో తెలుగు నేర్చుకోవాలని అనుకునేదాన్ని. ఈ సినిమావల్ల ఆ అవకాశం వచ్చింది. డబ్బింగ్‌ కూడా నేనే చెప్పా.

10/15

తెలుగులో ఇప్పటికే కొత్త సినిమా కథలు వింటున్నా. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది నా ఉద్దేశం. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధం.

11/15

సినిమా అనే కాదు, ఓటీటీలో వచ్చే వెబ్‌ సిరీస్‌లలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చేస్తా.

12/15

నాకు నచ్చిన పాత్రలు రాకుంటే, ఇష్టమైన రంగాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో వేటినైనా ఎంచుకుంటా. సినిమాల్లోనే ఉంటే ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తా.

13/15

జాతిరత్నాలు చూసినంతసేపూ కడుపుబ్బా నవ్వుతారని తెలుసు కానీ ఈ స్థాయిలో ప్రేక్షకులు స్పందిస్తారని ఊహించలేదు. థియేటర్‌లో ఈలలూ, అరుపులూ బయట ప్రశంసలూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

14/15

ఫరియా అబ్దుల్లా

15/15

ఫరియా అబ్దుల్లా

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని