‘చిత్రం’ చెప్పే విశేషాలు (11-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (11-09-2020)

1/8

ప్లాస్టిక్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు శివకుమార్‌. ప్లాస్టిక్‌ బాటిల్‌పై 1829 సార్లు ప్లాస్టిక్‌ వాడకండి (డోంట్‌ యూజ్‌ ప్లాస్టిక్‌) అని రాశాడు. ప్రజలకు అవగాహన కల్పించడానికి అతడు చేసిన ప్రయత్నం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కేలా చేసింది. శివకుమార్‌ వృత్తిరీత్యా జిమ్‌ కోచ్‌. అతని స్వస్థలం కర్ణాటక రామనగర జిల్లాలోని కొడంబల్లి గ్రామం.

2/8

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో లక్డీకపూల్‌, సైఫాబాద్‌ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

3/8

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ తెలంగాణ అసెంబ్లీ సమీపంలో ఆటోలో పరిమితికి మించి ప్రయాణిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంతమందిని ఒకే ఆటోలో ఎలా తీసుకెళ్తున్నావని డ్రైవర్‌ను నిలదీశారు. అందులో ప్రయాణిస్తున్నవారు తామంతా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అని, ఈ ఒక్కసారికి అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు.

4/8

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై అసెంబ్లీ వద్ద మూండంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఒకటో నంబర్‌ గేటు వద్దకు జీహెచ్‌ఎంసీ సిబ్బందిలా వచ్చిన భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

5/8

కాలుష్యం కారణంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ చెరువులో చేపలు చనిపోతున్నాయి. చెరువులో కలుస్తున్న కాలుష్యంతోనే జలచరాలు మృత్యువాత పడుతున్నాయని, దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాధుల బారిన పడకముందే చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

6/8

హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స కోసం తమ వారిని తీసుకొచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లే స్ట్రచర్లు, వీల్‌ఛైర్లు అందుబాటులో లేవు. ఓ స్వచ్ఛంద సంస్థ వీల్‌ఛైర్లు ఉచితంగా అందిస్తున్నా తీసుకెళ్లేందుకు సహాయక సిబ్బంది లేరు. దీంతో రోగులను వారి బంధువులు లోనికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.

7/8

హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన మహిళ జ్వరం, ఆయాసంతో ఇబ్బందిపడుతూ 108కు ఫోన్‌ చేసింది. అంబులెన్స్‌లో మొదట గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోగితో పాటు సహాయకులు ఎవరూ రాలేదనే కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తనను ఆస్పత్రిలోనికి తీసుకెళ్లాల్సిందిగా కోరగా చక్రాల కుర్చీ ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంబులెన్స్‌ సిబ్బంది ఎవరైనా వస్తేనే చక్రాల కుర్చీ ఇస్తామని చెప్పడంతో ఆమెను అంబులెన్స్‌లో నుంచి కిందికి దింపి వెళ్లిపోయారు. అసహాయ స్థితిలో ఇబ్బంది పడుతూనే నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లింది.

8/8

ఏపీలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మాస్క్‌ లేకుండా కనిపిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా కొందరు వినిపించుకోవడం లేదు. మాస్క్‌ లేకుండా కొందరు, మాస్క్‌ ఉన్నా సరిగా ధరించక మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డులో తీసిన చిత్రాలివి.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని