‘చిత్రం’ చెప్పే విశేషాలు (12-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (12-09-2020)

1/9

చిత్రంలోని బాలుడు పేరు ఆంజనేయులు. ఉండేది సికింద్రాబాద్‌ అన్నానగర్‌లో. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం పూట ఆన్‌లైన్‌ క్లాసులు విని మధ్యాహ్నం పూట ఇలా అమ్మానాన్నకు చేదోడుగా కూరగాయలు అమ్ముతున్నాడు. తీరిక సమయంలో ఫోన్‌లో ఇలా మిగిలిన పాఠాలను వింటున్నాడు. గృహ నిర్మాణ కార్మికులైన తల్లిదండ్రులు కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోవడంతో కూరగాయలు అమ్ముతున్నారు. శనివారం ఆంజనేయులు కుందన్‌బాగ్‌లో ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతూ ఆన్‌లైన్‌ పాఠాలు వింటుండగా తీసిన చిత్రమిది

2/9

లాక్‌డౌన్‌తో బోసిపోయిన భాగ్యనగర వీధులు ఇప్పుడిప్పుడే పూర్వ వైభవాన్ని సంతరించుకొంటున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. మెట్రో రైలు సేవలు ప్రారంభంతో ప్రయాణానికి ఇబ్బందులు తొలిగాయి. శనివారం సాయంత్రం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద తీసిన చిత్రమిది

3/9

వాహనాన్ని నడుపుతున్నప్పుడు మన నిర్లక్ష్యం ఎదుటవారికి ప్రమాదంగా పరిణమిస్తుంది. అన్నీ తెలిసినా ఓ యువకుడు బాధ్యత మరిచి హెల్మెట్‌, మాస్క్‌ ధరించకుండా ఓవైపు ద్విచక్ర వాహనం నడుపుతూ.. మరోవైపు ఫోన్‌ చూస్తూ కనిపించాడు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై కనిపించిందీ దృశ్యం.

4/9

వేతనాలు పెంచాలని కోరుతూ బిట్రన్‌లో వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆరోగ్య కార్యదర్శి మాట్‌ హాంకాక్‌‌ను విమర్శిస్తూ లండన్‌లో ప్లకార్డులను ప్రదర్శిస్తున్న నిరసనకారులు

5/9

కొవిడ్‌ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు కోసం వచ్చే గర్భిణులకు ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. అందులోకి ఇతరులను అనుమతించడం లేదు. దీంతో గర్భిణులకు సాయంగా వచ్చిన వారు వార్డు వెలుపల ఇలా గుమిగూడి కనిపించారు.

6/9

ఇవన్నీ పార్కింగ్‌ చేసిన కార్లు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. తిరుపతిలోని తిరుచానూరు-అలిపిరి రహదారిలో పైవంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. శనివారం ఉదయం ప్రకాశం పార్క్‌ వద్ద ఇలా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడంతో వరుసగా కార్లు ఇలా నిలిచిపోయాయి.

7/9

బ్రెజిల్‌ రియో డి జనీరోలోని జంతు సంరక్షణ కేంద్రంలో దత్తత తీసుకునే వారి కోసం వేచి చూస్తున్న శునకాలు. ఓ శునకాన్ని దత్తత తీసుకున్న అనంతరం దాన్ని ముద్దు చేస్తున్న దంపతులు

8/9

బ్రెజిల్‌లోని పాంట‌నాల్ అడవుల్లో అగ్నిప్రమాదం కారణంగా గాయపడిన పక్షికి చికిత్స చేస్తున్న పశువైద్యులు

9/9

అసోం రాజధాని గువాహటిలో కొవిడ్‌ సోకి చనిపోయిన భర్తకు అంత్యక్రియల జరిపించడానికి పీపీఈ కిట్‌ ధరించి శ్మశాన వాటిక వద్ద వేచి చూస్తున్న మహిళ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని