‘చిత్రం’ చెప్పే విశేషాలు (13-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (13-09-2020)

1/7

హైదరాబాద్‌ గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థి.. లోనికి అనుమతించాల్సిందిగా సిబ్బందిని బతిమాలుతున్న దృశ్యం

2/7

హైదరాబాద్‌ షేక్‌పేట ప్రధాన రహదారిపై ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితి ఇది. భౌతిక దూరం పాటించకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రం ఎదుట గుమిగూడారు. కొవిడ్‌ నిబంధనలను పాటించేలా కళాశాల నిర్వాహకులు, సిబ్బంది సరైనా ఏర్పాట్లు చేయలేదు. విద్యార్థులు వచ్చిన కార్లను ప్రధాన రహదారికి ఇరువైపులా నిలపడంతో ఇరుకుగా మారి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

3/7

హైదరాబాద్‌ శివారు గోపన్‌పల్లిలో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్షా కేంద్రం పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థుల్లో అధికశాతం కార్లలో రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

4/7

కరోనా కారణంగా నీట్‌ పరీక్ష రాసేందుకు ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విద్యార్థుల్లో అధికశాతం కార్లలోనే వచ్చారు. తినేందుకు ఆహారాన్ని ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్నారు. హైదరాబాద్‌ గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్షా కేంద్రం వద్ద బారులు తీరిన కార్లు.

5/7

హైదరాబాద్‌ మూసాపేటలో రద్దీ రహదారిలో ద్విచక్రవాహనంపై మంచాన్ని తీసుకెళ్తూ ఒక్క చేతితో ప్రమాదకరంగా వాహనం నడుపుతున్న వ్యక్తి.

6/7

సికింద్రాబాద్‌ సమీపంలోని బోయిన్‌పల్లి ప్రధాన రహదారిలో సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభం మూడు నెలల క్రితం విరిగిపడింది. సంబంధిత అధికారులకు చెప్పినా స్పందించడం లేదని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

7/7

ట్యాంక్‌బండ్‌ నిండి ఆ నీరు రహదారిపై చేరినట్టుంది కదా! ఆ నీరు ట్యాంక్‌బండ్‌లోనివి కాదు.. వర్షం నీరు పాదచారుల బాటపై నిలవడంతో మేఘాల ప్రతిబింబాలు చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని