‘చిత్రం’ చెప్పే విశేషాలు (14-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (14-09-2020)

1/9

రాష్ట్రంలో కరోనా ప్రారంభం నుంచి మంత్రి కేటీఆర్‌ రకరకాల మాస్కులు ధరించడంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. వాటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్‌ను సోషల్‌ మీడియా వేదికగా అనేక మంది అడుగుతున్నారు. వారి ప్రశ్నలకు స్పందించిన మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర చేనేత సహకార సంఘం వెబ్‌సైట్‌ tsco.co.in లో కొనుగోలు చేయవచ్చని లింకును ట్వీట్‌ చేశారు. ట్వీట్‌లో తాను ఇప్పటి వరకు ధరించిన మాస్కుల చిత్రాలను పోస్ట్‌ చేశారు.

2/9

గుంటూరులోని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ఒప్పంద ఉద్యోగులు ధర్నా చేశారు. తమ కాలపరిమితి ముగియక ముందే విధులు నుంచి తొలగించారని ఆరోపించారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఓ ఉద్యోగి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు.

3/9

సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండీ డివిజన్‌లోని కుట్టి వెల్లోడి కాలనీలోఉన్న పట్టణ ఆరోగ్యకేంద్ర వద్ద పరిస్థితి ఇది. కొవిడ్‌ పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చినవారు కనీసం నిలబడేందుకు చోటు లేక రహదారిపై బారులు తీరారు. ఇరుకుగా ఉండే ఈ కాలనీలో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. కొవిడ్‌ అనుమానితులు పరీక్షల కోసం వచ్చి తమ ఇళ్ల ముందు నిలబడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

4/9

పాతకార్లు అడ్డదిడ్డంగా పడిపోవడం చూసి ఏదో సినిమా షూటింగ్‌ లొకేషన్‌ అనుకుంటున్నారా..? ఆ కార్లన్నీ నిజమైనవే. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఉపయోగించిన వాహనాలు కాలం చెల్లడంతో నిజాం కళాశాల మైదానంలో వేలానికి ఉంచారు.

5/9

1.విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కారుమబ్బులు కమ్ముకోవడం చూపరులను ఆకట్టుకుంటోంది. 2.ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరద పెరగడంతో సోమవారం బ్యారేజీ గేట్లు ఎత్తారు. దీంతో దిగువకు ప్రవహిస్తున్న వరద నీటి నుంచి ఓ చేప పుష్కరఘాట్‌ పైకి ఇలా దూకింది.

6/9

తిరుమలలో ఆదివారం సాయంత్రం నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం పగటి పూట చీకట్లు కమ్ముకొని తీవ్రమైన చలి గాలులు వీచాయి. ఈ వాతావరణం శ్రీవారి భక్తులకు ఆహ్లాదాన్ని పంచింది.

7/9

భారీ వర్షాల కారణంగా కర్నూలులోని హంద్రీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఓ యువకుడు కేసీ కాలువ వంతెన అంచువెంబడి ప్రమాదకరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏమాత్రం పట్టుతప్పిన నదిలోపడి గల్లంతయ్యే ప్రమాదముంది.

8/9

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలులో వర్షానికి వాహనదారులు ఇలా ఇబ్బంది పడ్డారు.

9/9

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన కర్రి పుల్లేశ్వరరావు కౌలుకు తీసుకొని ఐదెకరాల్లో వరి పంట వేశాడు. కౌలుకు రూ.2 లక్షలు, పెట్టుబడికి లక్ష రూపాయలు ఖర్చయిందని.. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం సాయం చేసి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని