‘చిత్రం’ చెప్పే విశేషాలు (15-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (15-09-2020)

1/7

ఆకలితో అలమటిస్తున్న శునకానికి ఆహారం తింటున్న కపోతాలు కనిపించాయి. వేగంగా దూసుకొచ్చి ఓ పావురాన్ని నోట కరిచింది. గమనించిన తోటి పావురాలు కుక్కకు అడ్డుగా ఎగిరాయి. శునకం భయంతో పావురాన్ని వదిలి పరుగులు తీసింది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌లో చోటుచేసుకుంది ఘటన.

2/7

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌ నుంచి స్వస్థలాలకు వెళ్లినవారు క్రమక్రమంగా నగరానికి చేరుకుంటున్నారు. పలు రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చేరుకున్న ప్రయాణికులతో రద్దీగా మారిన చిలకలగూడ జంక్షన్‌.

3/7

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. జాగ్రత్తలు పాటించమని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొందరి నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలోని అలిపిరి రహదారిలో మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా ఫోన్లు చూస్తున్న యువకులు.

4/7

రంగురంగుల బండి.. చిన్న గిత్తలతో చూడముచ్చటగా ఉంది కదా! ఆ గిత్తలు పుంగనూరు జాతికి చెందినవి. అంతరించిపోయే దశలో ఉన్న వీటిని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన అడబాల లక్ష్మీనారాయణ పోషిస్తున్నారు. మూడేళ్ల వయసున్న ఈ గిత్తల కోసం లక్ష రూపాయల ఖర్చుతో ప్రత్యేకంగా ఎడ్లబండి తయారు చేయించారు.

5/7

చూస్తుంటే గడియారంలా ఉంది సమయం ఎంతో అర్థం కావడం లేదా? అది నిజమైన గడియారం కాదండీ. సూర్యుడు ఉదయిస్తుండగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో పవన విద్యుత్‌ తయారీ కేంద్రం వద్ద గాలి మర అడ్డుగా వచ్చి ఏర్పడిందీ అద్భుత దృశ్యం.

6/7

అమ్మో ఎక్కడివి ఇన్ని మొసళ్లు అనుకుంటున్నారా..? ప‌్ర‌పంచంలో అతిపెద్ద న‌దుల్లో ఒక‌టైన అమెజాన్ న‌ది తీరంలోని పాంట‌నాల్ చిత్త‌డి నేల‌ల్లో ఓ రహదారి పక్కన ఇలా మొసళ్ల గుంపు కనిపించింది.

7/7

కొవిడ్‌ నుంచి వినియోగదారులను రక్షించేందుకు వ్యాపార సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. దక్షిణ కొరియా సియోల్‌లోని ఓ బేకరిలో రోబో ద్వారా సేవలు అందిస్తున్నారు. బేకరికి వచ్చినవారు అక్కడ ఏర్పాటు చేసిన స్మార్ట్‌ తెరపై తమకు కావాల్సినవి ఎంపిక చేసుకుంటే వాటిని రోబోలు వారి వద్దకు తీసుకొస్తాయి.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని