‘చిత్రం’ చెప్పే విశేషాలు (17-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (17-09-2020)

1/7

సాధారణంగా వరదలో చేపలు, పాములు కొట్టుకొస్తాయి. విచిత్రంగా చిప్స్‌ ప్యాకెట్లు రావడం చూశారా? కర్నూలు జిల్లాలో ఆత్మకూరు-కొత్తపల్లిలో మార్గంలో వరద ఉద్ధృతిలో పదుల సంఖ్యలో చిప్స్‌ ప్యాకెట్లు కొట్టుకుపోతుండగా స్థానికులు వాటిని తీసుకొని తినేందుకు ప్రయత్నించారు.

2/7

హైదరాబాద్‌లో కొవిడ్‌ పరీక్ష కోసం స్వాబ్‌ నమూనా ఇచ్చేందుకు వచ్చి భయపడుతున్న వ్యక్తిని సముదాయిస్తున్న వైద్య సిబ్బంది.

3/7

రహదారిపైనే బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారా? మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు పూజలు చేసిన అనంతరం బ్రాహ్మణులకు దానమిస్తారు. ఇంటికి పిలిచి ఇవ్వాల్సిన దానం కరోనా భయంతో ఇలా రహదారిపై చేసుకోవాల్సి వచ్చింది. సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్డులో బ్రాహ్మణులకు దానమిచ్చి ఆశీర్వాదం తీసుకోవడం కనిపించింది.

4/7

భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌ టోలిచౌకిలోని నదీం కాలనీ నీటమునిగింది. కాలనీలోని రహదారులు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

5/7

నిరుపయోగంగా ఉన్న వస్తువులతో చక్కని కళాకృతులను తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌ మైండ్‌ స్పేస్‌ కూడలిలోని వంతెన కింద వాలిన పక్షి, దాని సమీపంలోని రాయిపై పులి చూపరులను ఆకట్టుకుంటోంది.

6/7

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈక్వెడార్‌ దేశ రాజధాని క్విటోలో ఆందోళన చేస్తున్న వారిపై జల ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు.

7/7

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన వెంకట నారాయణ తోటలో బాతు ఆకారంలో కాసిన బొప్పాయి కాయ.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని