‘చిత్రం’ చెప్పే విశేషాలు (18-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (18-09-2020)

1/7

కొవిడ్‌ ఫ్యాషన్‌ రంగంపైనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. లండన్‌లో నిర్వహించిన స్ప్రింగ్‌, వింటర్‌ 2021 ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న మోడళ్లు పలు రకాల డిజైనర్‌ దుస్తులను ప్రదర్శించారు. ర్యాంప్‌ వాక్‌ సమయంలో పల్చని మాస్కులు ధరించారు.

2/7

దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ వంతెన హైదరాబాద్‌ దుర్గం చెరువుపై నిర్మించారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన 754 మీటర్ల పొడవు గల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే మాదాపూర్‌-జూబ్లీహిల్స్‌ మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది.

3/7

గచ్చిబౌలిలో కొందరు నిరుద్యోగ యువకులు ప్రారంభించిన టిఫిన్‌ సెంటర్‌ కొద్ది కాలంలోనే లాభాల బాట పట్టింది. దీంతో హైటెక్‌ సిటీలో మరో టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని రూ.12లక్షలతో మొబైల్‌ రెస్టారెంట్‌ను సిద్ధం చేసుకున్నారు. ప్రారంభానికి ముందే లాక్‌డౌన్‌ విధించడంతో రోడ్డు పక్కన ఇలా వదిలేయడంలో శిధిలావస్థకు చేరుకుంది. కొనుగోలుదారులు లేక పాత టిఫిన్‌ సెంటర్‌ సైతం మూతపడింది.

4/7

పాఠశాలలకు సెలవులు కదా.. విద్యార్థులు బారులు ఎందుకు తీరారు అనుకుంటున్నారా? కరోనా కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని నేరుగా వారికే ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంటూరు ఆర్‌.అగ్రహారంలోని ఉన్నత పాఠశాలలో తమకు రావాల్సిన బియ్యం, గుడ్లు, పల్లీ చిక్కీల కోసం విద్యార్థులు భౌతిక దూరం పాటించకుండా నిలబడ్డారు.

5/7

దక్షిణ కొరియా సియోల్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజల్లో ధైర్యం నింపేందుకు అధికారులు ఓ పార్కులో కృత్రిమ చందమామలను ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు వచ్చిన సందర్శకులు సెల్ఫీలు దిగారు.

6/7

ఇండోనేషియా బాలి సమీపంలోని గ్రామంలో సంప్రదాయ వస్త్రాలు ధరించి తిరుగుతున్న ఓ మహిళ, బాలుడు. వీరిని స్థానికులు గ్రామ రక్షకులుగా పిలుస్తారు. దుష్ట శక్తుల నుంచి గ్రామాన్ని కాపాడతారని నమ్ముతారు.

7/7

ఆకాశంలోకి విల్లు ఎక్కు పెట్టిందెవరా.. అనుకుంటున్నారా? అమెరికా కాన్సస్‌ రాష్ట్రంలోని స్టేట్‌ హోంపై ఉన్న కాంస్య విగ్రహం సూర్యాస్తమయ సమయంలో ఈ విధంగా కనువిందు చేసింది.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని