‘చిత్రం’ చెప్పే విశేషాలు (19-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (19-09-2020)

1/8

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మలా గ్రామంలో ఎగువ మానేరు పొంగిపొర్లుతోంది. ఈ జలాశయం సామర్థ్యం రెండు టీఎంసీలు. కామారెడ్డి జిల్లా పల్వంచ వాగు, మెదక్‌ జిల్లా కూడెళ్లి వాగు ద్వారా వచ్చే నీటితో ఇది నిండుతుంది. జలపాతాన్ని చూసేందుకు కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల నుంచి గత నాలుగు రోజులుగా రోజూ సుమారు రెండు వేల మంది సందర్శకులు వస్తున్నారు.

2/8

ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. పరీక్షల విధులను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించారు. దీంతో విధులకు సంబంధించిన నియామక పత్రాల కోసం గుంటూరులోని స్టాల్‌ బాలికల ఉన్నత పాఠశాల వద్ద బారులు ఇలా ఉద్యోగులు శనివారం బారులు తీరారు.

3/8

అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని పర్యటించారు. ఇందులో భాగంగా చిన్నారులతో ముచ్చటిస్తూ మోకాలిపై నిల్చున్నారు.

4/8

అమెరికాలో గత ఆగస్టు 22న కాలిఫోర్నియాలో ప్రారంభమైన కార్చిచ్చు ఉద్ధృతి కొనసాగుతోంది. దావానలంలో లక్షలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. దీంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎయిర్‌ ట్యాంకర్‌ ద్వారా రసాయనాలను వెదజల్లుతున్నారు.

5/8

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద పాదచారుల బాట ఆధునీకరణ పనులు చేస్తున్న కూలీలు. తల్లితోపాటు వచ్చిన ఓ చిన్నారి మట్టిలో ఆడుకుంటున్న దృశ్యం.

6/8

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను వ్యతిరేకిస్తూ లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద ప్రజలు ఇలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.

7/8

వినూత్నమైన సంగీతం, నృత్యాల నడుమ 16 రోజుల పాటు జరిగే అక్టోబర్‌ ఫెస్ట్‌ను కొవిడ్‌ కారణంగా జర్మనీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఫెస్ట్‌ కోసం ఉపయోగించే వస్తువులతో మ్యూనిచ్‌లో హృదయం ఆకారాన్ని రూపొందించారు. అక్టోబర్‌ ఫెస్ట్‌లో బీరు, మ్యూజిక్‌తోపాటు ఫుడ్‌కు తగిన ప్రాధాన్యత ఉంటుంది.

8/8

నూతన ఎన్నికలు, ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టాలని కోరుతూ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్వహించిన ర్యాలీలో ముసుగులు ధరించిన నిరసనకారులు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని