‘చిత్రం’ చెప్పే విశేషాలు (20-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (20-09-2020)

1/8

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని బోడికొండ జలపాతమిది. హైదరాబాద్‌ నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. నగర ప్రజలు వారాంతాల్లో జలపాతాన్ని చూసేందుకు వస్తున్నారు.

2/8

గుంటూరులో ప్రధాన రహదారికి ఆనుకొని ఉండే ఏసీ కళాశాలలో ఆదివారం సచివాలయ ఉద్యోగుల పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ముగియడంతో అభ్యర్థులంతా ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అదే సమయంలో కర్నూలు నుంచి జీజీహెచ్‌కు వెళ్తున్న ఓ అంబులెన్సు రాంగ్‌ రూట్‌లో వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుంది. రహదారిపై వాహనాలు కిక్కిరిసి ఉన్నా వాహనచోదకులు సమన్వయంతో అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. అయినప్పటికీ పదిహేను నిమిషాలపాటు అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.

3/8

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ చౌరస్తా నుంచి నాగార్జున సాగర్‌ వెళ్లే మార్గం భారీ వర్షం కారణంగా జ‌ల‌మ‌యమైంది. రహదారిపై నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు.

4/8

సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ సమీపంలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ చిన్నారి పెన్నులు అమ్ముతోంది. ఆ చిన్నారి పరిస్థితి చూసి చలించిన యువతి సిగ్నల్‌ పడినా ముందుకు వెళ్లకుండా ఆగి పెన్ను కొనుగోలు చేసి వెళ్లింది.

5/8

బ్యాటరీ కారు కొనమని తల్లిదండ్రులను చిన్నారులు మారం చేస్తుంటారు. వాటిని నడపాలనే కోరిక బాల్యంలో సహజం. పెద్ద పెద్ద దుకాణాల్లో వేల రూపాయలు ఖరీదు ఉండే బ్యాటరీ కార్లు ఇప్పుడు తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద పాదచారుల బాటపై అమ్ముతున్న బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేస్తున్న ప్రజలు.

6/8

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని కోరుతూ అలిపిరి వద్ద రహదారిపై పొర్లు దండాలు పెడుతున్న తెదేపా నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, సుగుణమ్మ తదితరులు.

7/8

నెల్లూరు బ్యారేజీ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్నానదిని తిలకిస్తున్న ప్రజలు.

8/8

విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు మూడు రోజుల క్రితం కొవిడ్‌ బారినపడ్డాడు. గూడవల్లిలోని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రంలో చికిత్సపొందుతున్నాడు. ఆదివారం సచివాలయ పరీక్ష రాసేందుకు మొగల్రాజపురంలోని పరీక్షా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వచ్చాడు. పీపీఈ కిట్‌ ధరించి పరీక్ష రాసిన అనంతరం ద్విచక్ర వాహనంపై క్వారంటైన్‌ కేంద్రానికి వెళ్లాడు. కొవిడ్‌ సోకిన వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో పరీక్ష కేంద్రానికి తీసురావాల్సి ఉండగా అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేయలేదు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అయిదుగురు కొవిడ్‌ రోగులు సచివాలయ పరీక్షలకు హాజరయినట్లు సమాచారం.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని