‘చిత్రం’ చెప్పే విశేషాలు (21-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (21-09-2020)

1/9

లాక్‌డౌన్‌ కారణంగా మూతబడిన ఆగ్రాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌ ఆరు నెలల అనంతరం సోమవారం నుంచి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. కొవిడ్ కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. రోజుకు కేవలం అయిదు వేల మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు.

2/9

ఒకప్పుడు కరవుతో అల్లాడిన చిత్తూరు జిల్లాలోని కమ్మగుట్టపల్లి.. నేడు వరి పంటతో కళకళాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు దామోదర్‌ నాయుడు అనే రైతు పొలంలోని 65 అడుగుల ఊట బావి నుంచి నీరు పొంగిపొర్లుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా నీరు రావడానికి చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు కారణమని గ్రామస్థులు భావిస్తున్నారు. కరవుతో గ్రామాలు వదిలి వెళ్లిన వారు కరోనా కారణంగా తిరిగి వచ్చారు. ఇప్పుడు గ్రామంలో భూగర్భ జలాలు పెరగడం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే ఉండి వ్యవసాయ చేసుకొని జీవిస్తామంటున్నారు.

3/9

మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్‌ కార్యకర్తలు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ప్రతిఘటించిన వ్యక్తిని ఇలా మోసుకెళ్లారు.

4/9

శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి వరకు సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాల పక్కన నాటిన మొక్కలు ఎదిగి విద్యుత్‌ దీపాలను కమ్మేశాయి. చెట్లు కారణంగా వీధి దీపాలు ఉన్నా రహదారిలో చీకటి అలుముకోవడంతో మున్సిపల్‌ సిబ్బంది చెట్లను సగానికి నరికేశారు.

5/9

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ‘సూత్ర’ లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ ప్రచార పోస్టర్‌ను విడుదల చేస్తున్న మోడళ్లు.

6/9

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. తపోవన్‌ కాలనీలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి వరద నీటిలో పడి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సుమారు 20 గంటలపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సరూర్‌నగర్‌ చెరువులో గాలించగా ఘటన జరిగిన ప్రదేశానికి వందమీటర్ల దూరంలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

7/9

వికీలీక్స్‌ సహవ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేను అమెరికాకు అప్పగించొద్దని కోరుతూ లండన్‌లోకి సెంట్రల్‌ క్రిమినల్‌ కోర్టు ఎదుట అసాంజే మద్దతుదారులు ఇలా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

8/9

అమ్మో ఎన్ని తిమింగళాలు అనుకుంటున్నారా? పాపం అవన్నీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా స్ట్రాహాన్‌లో సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగళాలు తీరంలోని ఇసుకలో కూరుకుపోయాయి. ఈ విధంగా సుమారు 250 తిమింగళాలు చిక్కుకుపోయాయి. వీటిని రక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

9/9

అమెరికాలో ప్రతిష్టాత్మక టెలివిజన్‌ అవార్డులైన ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని లాస్‌ఏంజెల్స్‌లో ఆదివారం నిర్వహించారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో విజేతలను ప్రకటించేందుకు వేదికపైకి వచ్చిన నటుడు జాసన్ సుడేకిస్‌కి అక్కడే కొవిడ్‌ పరీక్ష చేయించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి నటుడు క్షమాపణ చెప్పారు. కొవిడ్‌ పరీక్షను తాను బాధ్యతగా భావిస్తున్నానని, ఇది అవార్డుల కమిటీ విధాన నిర్ణయమని పేర్కొన్నారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని