‘చిత్రం’ చెప్పే విశేషాలు (22-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (22-09-2020)

1/7

కరోనా నుంచి రక్షణ కోసం ముఖానికి ధరించాల్సిన మాస్కును ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా ద్విచక్ర వాహనం నెంబర్‌ ప్లేటుకు పెట్టి కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో ప్రయాణిస్తున్న యువకులు.

2/7

అమెరికా నార్త్‌ కరోలినాలోని మెర్గాంటన్‌లో సింక్‌హోల్‌లో పడిన శునకాన్ని రక్షిస్తున్న బుర్కే కౌంటీ విపత్తు నిర్వహణ దళ సభ్యుడు.

3/7

అవి నిరసన తెలుపుతూ పాతిన జెండాలు కాదు. కొవిడ్‌ మృతుల స్మారకంగా ఉంచిన జెండాలు. అమెరికాలో కొవిడ్‌ కారణంగా 20 వేల మంది మృతిచెందారు. వారందరి గుర్తుగా కొవిడ్‌ మెమోరియల్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ నేషనల్‌ మాల్‌ మైదానంలో ఇలా జెండాలను ఉంచారు.

4/7

కొవిడ్‌ కారణంగా రోగ నిరోధకశక్తి పెంపొందించుకునేందుకు కోడి మాంసం, గుడ్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో మార్కెట్‌లో వాటి ధరలు భారీగా పెరిగాయి. గుడ్డు ఒక్కోటి చిల్లర ధర రూ.6 చొప్పున పలుకుతోంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ కోళ్ల పరిశోధనా కేంద్రంలో బాయిలర్‌, నాటు కోడి గుడ్లను రూ.5 చొప్పున ప్రతి రోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు అమ్ముతారు. అర్ధగంట సమయంలోనే రెండు వేల గుడ్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి కేవలం 20 గుడ్లు మాత్రమే ఇస్తారు.

5/7

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఓ కార్యకర్త కలెక్టరేట్‌ ఆవరణలోని చెట్టు ఎక్కి నినాదాలు చేస్తూ జారిపోయి వేలాడుతుండగా తోటి కార్యకర్తలు కిందికి దించారు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

6/7

ఫిన్లాండ్‌లోని హెల్సింకి విమానాశ్రయంలో కొవిడ్‌ సోకిన ప్రయాణికులను గుర్తించేందుకు శునకాలను ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా కొవిడ్‌ పరీక్షలు చేయడం ప్రపంచంలోనే తొలిసారి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాలను ఓ బూత్‌లో ఉంచుతారు. విమానాశ్రయంలోకి వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేక కాగితం ఇస్తారు. దానిని శరీరంపై రుద్ది నిర్దేశించిన కప్పులో వేయాలి. ఆ కప్పును కుక్క ఉన్న బూత్‌లోకి పంపిస్తారు. పాజిటివ్‌ ఫలితాలు విమానాశ్రయంలోని ఆరోగ్య సమాచార కేంద్రానికి పంపిస్తారు.

7/7

ఈ మనోహరమైన దృశ్యం గ్రాఫిక్స్‌తో రూపొందించలేదు. మంగళవారం తెల్లవారుజూమున డెన్మార్క్‌ ఫైన్‌ ద్వీపంలోని ఓ రహదారి ఈ విధంగా కనిపించింది.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని