‘చిత్రం’ చెప్పే విశేషాలు (25-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (25-09-2020)

1/6

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రియులను కలచివేసింది. బాలు మృతికి సంతాపంగా విజయవాడకు చెందిన జోస్యుల వేణుగోపాల్‌ ఎస్పీబీ పాడిన పాటల్లోని పల్లవులతో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

2/6

హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను ఐటీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం బాణసంచా వెలుగుల్లో శోభాయమానంగా కనిపిస్తున్న వంతెన.

3/6

కాంగ్రెస్‌ జాతీయ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న ఎంపీ రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌.

4/6

వినాయకచవితి సందర్భంగా పూజించిన విగ్రహాలను తర్వాత చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తుంటారు భక్తులు. ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను కొందరు భక్తులు 2019లో తిరుపతి వినాయక సాగర్‌లో నిమజ్జనం చేశారు. అవి ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నాయి. మట్టితో చేసిన విగ్రహాలు రోజుల వ్యవధిలోనే భూమిలో కలిసిపోగా.. ఇవి మాత్రం ఇలా దర్శనమిస్తున్నాయి.

5/6

కొవిడ్‌ కారణంగా తాత్కాలికంగా మూసివేసిన హాంకాంగ్‌లోని డిస్నీలాండ్‌ శుక్రవారం పునఃప్రారంభమైంది. దీంతో ప్రముఖ కార్టూన్‌ పాత్రలైన డొనాల్డ్‌ డక్‌, డైసీ డక్‌ ఎదుట ఫొటోలు దిగుతున్న సందర్శకులు.

6/6

చిత్రంలో కనిపిస్తున్నది సాధారణ ఎలుక కాదు. మగావా అనే ఈ ఎలుక ల్యాండ్‌మైన్లను గుర్తించడంలో నేర్పరి. కంబోడియాలో ఇప్పటి వరకు 39 ల్యాండ్‌మైన్లు, 28 పేలుడు పదార్థాలను గుర్తించింది. దీని కృషిని గుర్తించిన బ్రిటిష్ జంతు స్వచ్ఛంద సంస్థ యూకేలో అత్యున్నత పురస్కారానికి సమానమైన పీడీఎస్‌ఏ బంగారు పతాకం అందించింది. ఈ అవార్డును పొందిన తొలి ఎలుక మాగావా.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని