‘చిత్రం’ చెప్పే విశేషాలు (26-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (26-09-2020)

1/6

లైంగిక వివక్షకు వ్యతిరేకంగా ఉరుగ్వే రాజధాని మోంటేవీడియోలో నిర్వహించిన ర్యాలీలో పువ్వులతో అలంకరించిన మాస్కు ధరించిన ఓ వ్యక్తి.

2/6

గువాహటి శివారులోని రాణి అభయారణ్యం నుంచి ఆహారం కోసం సమీప గ్రామానికి వచ్చిన రెండు ఏనుగులు విద్యుదాఘాతంతో మృతిచెందాయి. వాటిని ఖననం చేసేముందు దంతాలను తీసి భద్రపరిచారు అటవీశాఖ అధికారులు.

3/6

రష్యా రాజధాని మాస్కోలో మోటార్‌ సైకిల్‌ పండగ సందర్భంగా ఐకానిక్‌ గార్డెన్‌ రింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీలో విచిత్ర వేషధారణతో పాల్గొన్న ఔత్సాహికుడు.

4/6

కొవిడ్‌ నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు వ్యతిరేకిస్తూ లండన్ ట్రాఫాల్గర్ స్క్వేర్ వద్ద శనివారం వేలమంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. అందులో కొందరు నిరసనకారులు కొవిడ్‌ వైరస్‌ను పోలిన మేకప్‌ వేసుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు.

5/6

శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు కొవిడ్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా అహ్మదాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయ ఆవరణలో ఆవిరి యంత్రాలను ఏర్పాటు చేశారు.

6/6

మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ముంబయిలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారుల ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి దీపికను ఎన్‌సీబీ అధికారులు విచారణకు పిలిచారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని