‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/7

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ బెంగళూరులో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి మేకపోతును అందంగా అలంకరించి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చాడు

2/7

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయి. వరద ఉద్ధృతితో గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో నీటమునిగిన పంటపొలాలు చెరువును తలపిస్తున్నాయి

3/7

సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండీ డివిజన్‌ పరిధిలోని కుట్టి వెల్లోడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొవిడ్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో సిబ్బందికి, పరీక్ష కోసం వచ్చే వారికి మధ్య రక్షణగా తెల్లని వస్త్రాన్ని రెండువైపులా చెట్లకు కట్టారు. ఆ వస్త్రానికి రంధ్రాలు చేసి వాటి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు

4/7

జైలు నుంచి పారిపోయిన ఖైదీలా కాళ్లు చేతులు గొలుసులతో బంధించిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని సచివాలయం సమీపంలో రోడ్డుపై కనిపించాడు. అతడిని చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఆ వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగా లేదు. గతంలో ఓ సారి నడుచుకుంటూ ఛత్తీస్‌గఢ్‌ వెళ్తే పోలీసుల సాయంతో తీసుకొచ్చారు. మరోసారి అలా వెళ్లిపోకుండా కుటుంబసభ్యులే అతడి కాళ్లు చేతులకు గొలుసులు కట్టారని ‘ఈనాడు’ సేకరించిన వివరాల ద్వారా తెలిసింది.

5/7

ప్రయాగరాజ్‌లోని గంగానది నుంచి కావిడి ద్వారా పవిత్రజలాలను తీసుకెళ్లిన పవిత్ర జలాలలతో మహదేవ్‌ ఆలయంలో అభిషేకం చేస్తున్న భక్తులు. కొవిడ్‌ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

6/7

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం పశ్చిమ లండన్‌లోని రూయిస్లిప్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కొద్దిసేపు కిక్రెట్‌ ఆడారు

7/7

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్పెయిన్‌ బార్సిలోనాలో వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తుండగా వారి మధ్యలోకి వచ్చి కూర్చున్న శునకాన్ని సముదాయిస్తున్న మహిళ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని