‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/9

ఈ రెండు వరసలూ చూడ్డానికి ఒకేలా కనిపిస్తున్నా వాటి నేపథ్యాలు వేరు. సనత్‌ నగర్‌లోని మినిస్టర్‌ రోడ్డులో ఉన్న కిమ్స్‌ ఆస్పత్రి వద్ద కనిపించిందీ దృశ్యం. ఆస్పత్రికి వచ్చేవాళ్లు ఇలా రోడ్లపై కార్లు నిలిపి ఉంచడంతో క్యూ కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ వద్ద కనిపించిందీ రెండో దృశ్యం. ఓ స్వచ్ఛంద సంస్థ ఉదయం పూట అల్పాహారం అందిస్తుండడంతో వాటిని అందుకునేందుకు ప్రజలు ఇలా గుమిగూడారు.

2/9

లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. హైదరాబాద్‌ నగరంలో కరోనాకు పూర్వ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోఠిలోని వ్యాపారుల కోసం ఓ రిక్షావాలా దిండ్లను ఇలా పట్టుకెళ్తున్నాడు.

3/9

ఈ దుస్తులు చూసి కొత్తరకం పీపీఈ కిట్లు అనుకునేరు! పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా మోడళ్లు ఈ విధంగా దుస్తులు ధరించి కనిపించారు. కరోనా నేపథ్యంలో వస్త్రాల డిజైన్‌లో కూడా మార్పులు వస్తున్నాయి.

4/9

కొవిడ్‌ మహమ్మారి విస్తరిస్తున్న వేళ వైద్యులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. నేపాల్‌లో తాజాగా చిన్నారులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తల్లితో పాటు వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వచ్చిన చిన్నారి చేతికి ముందు శానిటైజర్‌ రాసి అనంతరం వ్యాక్సిన్‌ వేశారు.

5/9

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం రాయపాడు వద్ద కుందూ నదిపై ఉన్న వంతెన దుస్థితి ఇది. ఇటీవల వరద ఉద్ధృతికి వంతెనపై ఉన్న రహదారి కొట్టుకుపోవడంతో గోతులమయంగా మారింది. ఈ రహదారిపై వాహనదారులు ఇలా ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా నదిలో గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది.

6/9

యూపీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

7/9

కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరుకు చెందిన కౌలు రైతు మూడు ఎకరాల్లో వేసిన మిరప పంట వరదల కారణంగా కొట్టుకుపోయింది. దీంతో కూలీలతో మళ్లీ మిరపనారు వేయిస్తున్నారు.

8/9

కర్నూలు: వరద నీటి కారణంగా కుందూ నదిలో మునిగిపోయిన ఇంజన్లను తాళ్ల సాయంతో ఒడ్డుకు లాగేందుకు ప్రయత్నిస్తున్న రైతులు

9/9

కర్నూలు: వర్షాల కారణంగా కుళ్లిపోయిన పంటను చూపిస్తున్న బాధిత రైతు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని