‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/7

హుస్సేన్‌సాగర్‌‌పై భారీ సీతాకోక చిలకలు వాలినట్లు భ్రమించేలా క్రీడాకారులు తమ పడవలతో శిక్షణలో పాల్గొని సందడి చేశారు.

2/7

వీరంతా సముద్రం అడుగున కూర్చొని జలచరాల అందాన్ని ఆస్వాదిస్తున్నారనుకుంటే పొరపాటే! భాగ్య నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే క్రతువులో భాగంగా ఖైరతాబాద్‌ కూడలిలోని వంతెనకు మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

3/7

చైనా జాతీయ దినోత్సవం నిర్వహిస్తున్న వేళ హాంకాంగ్‌లోని కాజ్‌వే బేలో ఓ వ్యక్తి భారత సైనికులకు మద్దతు పలికాడు. భారీగా పోలీసు బలగాలు అక్కడ మోహరించినప్పటికీ ధైర్యంగా మన దేశ జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టాడు.

4/7

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌. చూసేందుకు ముష్టి యుద్ధం చేస్తున్నట్లున్నా వారు చేస్తోంది మాత్రం కరచాలనానికి ప్రత్యామ్నాయమే! పారిస్‌లో నిర్వహించిన ‘ఇన్నో జెనరేషన్‌’ కార్యక్రమానికి హాజరైన ఈ ఇరువురు దేశాధ్యక్షులు బంప్‌లతో ఒకరినొకరు పలకరించుకొన్నారు.

5/7

మాస్క్‌ ధరించి, సురక్షిత దూరం పాటిస్తే కరోనా బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటే కొందరు పెడచెవిన పెడుతున్నారు. కెనడాలోని మాంట్రియల్‌లో మాస్కులు ధరించడానికి విముఖత తెలియజేస్తూ నిరసనకు దిగారు.

6/7

మాస్క్‌ ధరించి, సురక్షిత దూరం పాటిస్తే కరోనా బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటే కొందరు పెడచెవిన పెడుతున్నారు. కెనడాలోని మాంట్రియల్‌లో మాస్కులు ధరించడానికి విముఖత తెలియజేస్తూ నిరసనకు దిగారు.

7/7

ఆదమరిచి నిద్రిస్తున్న తనపై అకస్మాత్తుగా ఓడ దాటుకొని వెళ్లిపోతుంటే ఉలిక్కిపడి లేచినట్లుగా ఉంది కదూ! విశాఖ సాగరతీరంలో కనిపించిందీ దృశ్యం.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని