‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/8

దుర్గం చెరువు తీగల వంతెనపై భారీగా నిలిచిన వాహనాలు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించని నేపథ్యంలో ఆ సమయం కంటే ముందే ఈ విధమైన రద్దీ కనిపించింది.

2/8

జీడిమెట్ల-సూరారం క్రాస్‌ రోడ్డులోని ఉమామహేశ్వర స్వామి ఆలయం కొండ గుహ ద్వారానికి భారీ గజరాజును తలపించేలా వేసిన రంగులు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

3/8

దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో చేతివృత్తుల కళాకారులు అమ్మవారి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. విగ్రహాల ఎత్తు 8 అడుగులకు మించకూడదని ఆంక్షలు విధించడంతో తక్కువ ఎత్తులోనే వాటిని రూపొందించేందుకు మొగ్గు చూపుతున్నారు.

4/8

హైదరాబాద్‌లోని శామీర్‌పేట చెరువులో చేపలు పడుతూ సేదతీరుతున్న సందర్శకులు.

5/8

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ శివారులోని కొండ పోచమ్మ రిజర్వాయర్‌ జళకళ సంతరించుకుంది. దీంతో నగర వాసులు ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళుతున్నారు. ఎలాంటి రక్షణ చర్యలూ లేకుండా చేస్తున్న ఈ విహారయాత్ర వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

6/8

నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌ ఎదుట ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం అతడ్ని ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. అటుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు కిందపడిన వ్యక్తికి సహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

7/8

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అక్కడి పరిసరాలను క్రిమిరహితం చేసిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ఇలా మహాత్ముడికి నివాళులర్పించారు.

8/8

విశాఖ జిల్లా గంట్యాడ శివారు దిబ్బపాలెం కొండపై మరింత హరిత శోభ తెచ్చేందుకు నేవీ హెలికాప్టర్‌ సహాయంతో విత్తనాలు చల్లారు. ఇందు కోసం హెలికాప్టర్‌కు ప్రత్యేకంగా గరాటా అమర్చిన తీరును అంతర్‌ వృత్తంలో చూడొచ్చు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని