‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/6

కరోనా వైరస్‌ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెబుతూ ట్రంప్‌ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

2/6

అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాలన్నీ నిలిపివేయడంతో చివరి దశకు చేరిన పనులన్నీ వృథా అవుతున్నాయి. 16 నెలలుగా నెక్కల్లు నుంచి కృష్ణాయపాలెం వెళ్లే రహదారి చివరి పొర పనులు నిలిచిపోయాయి. దీంతో అక్కడి తారు రోడ్డు మీదే గడ్డి మొలకలు వచ్చి మైదానాన్ని తలపిస్తోంది.

3/6

హైదరాబాద్‌ నగర శివారులోని అమీన్‌పూర్‌ చెరువులోకి కొత్తనీరు రావడంతో కళకళలాడుతోంది. దీంతో రకరకాల పక్షులు చేపల వేటకు వస్తున్నాయి. వాటిలో నల్లటి ముక్కు, మెడ కలిగిన కొంగలు సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి.

4/6

కొవిడ్‌ 19 ప్రభావంతో కార్యాలయం నుంచే పని చేసే సంస్కృతిలో మార్పు వచ్చింది. అంతర్జాలం అందుబాటులో ఉంటే చాలు ఎక్కడ నుంచైనా విధులు నిర్వర్తిస్తున్నారు. సికింద్రాబాద్‌ ఆలుగడ్డ బావి వద్ద ఓ యువకుడు బైక్‌పై కూర్చొని ల్యాప్‌టాప్‌లో తన ఉద్యోగాన్ని చక్కబెడుతూ కనిపించాడు.

5/6

రాయలసీమలో కురుస్తున్న అధిక వర్షాలు వేరుశెనగ రైతులకు శాపంగా మారాయి. ఏటా వర్షాలు లేక కరవు ఏర్పడేది. అందుకు భిన్నంగా ఈ సారి రెట్టింపు వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎకరాకు 5 నుంచి 6 బస్తాల దిగుబడి రావడమే కష్టంగా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

6/6

సంజీవయ్య పార్కు వద్ద రోడ్డు పనులు జరుగుతున్నప్పటికీ కొందరు ద్విచక్ర వాహనదారులు అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. రాళ్లను ఆసరాగా వేసుకొని ఇలా వాహనాలను దాటిస్తూ కనిపించారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని