‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/8

డిజిటల్‌ యుగంలో ప్రచారం రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతోంది. గుంటూరుకు చెందిన సుమంత్‌ అనే వ్యాపారి రాత్రిపూట తళుక్కున మెరిసే డిజిటల్‌ టీ షర్ట్స్‌, టోపీలను విక్రయిస్తున్నారు. వీటిపై వాణిజ్య సంస్థల ప్రకటనలు, వేడుకలకు సంబంధించిన చిత్రాలను ముద్రిస్తుండటంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

2/8

మనిషిలాగా రెండు కాళ్లపై నిలబడి, గడ్డం కింద చేతులు పెట్టుకొని పోజిస్తున్న ఈ కీటకం పేరు ప్రేయింగ్‌ మాంటిస్‌. త్రిభుజం ఆకృతిలో కనిపించే ఈ జాతిలో మగ కీటకాలు మాత్రమే ఎగురుతాయి. నక్లెస్‌ రోడ్డులోని ఓ మొక్కమీద వాలిన ఈ అరుదైన జీవి కెమెరాలో బందీ అయ్యింది.

3/8

ఈ చిత్రంలో కనిపిస్తోంది ఏదో అభివృద్ధి పనుల కోసం వేసిన శిలాఫలకం అనుకుంటే మీరు పొరబడ్డట్లే! ఇది మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పెద్ద చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు ముద్రించిన శిలాఫలకం. అజాగ్రత్తగా వ్యవహరించి ఈ ప్రాంతంలో 80మంది ప్రాణాలు కోల్పోయారని పర్యాటకులను హెచ్చరించేందుకు అధికారులు దీన్ని ఏర్పాటు చేశారు.

4/8

పొలం గట్లపై నీడనిచ్చే చెట్లను పెంచడం సర్వసాధారణం. ఇందుకు భిన్నంగా గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో మాత్రం మామిడి చెట్లు దర్శనమిస్తాయి. అప్పట్లో ఇక్కడ స్థిరపడిన గోదావరి జిల్లాల రాజులు వీటిని నాటినట్లు స్థానికులు చెబుతున్నారు.

5/8

మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌ రెస్టారెంట్‌లో దుర్గం చెరువు తీగల వంతెన సోయగాన్ని చూస్తూ రుచులను ఆస్వాదిస్తున్న భోజనప్రియులు.

6/8

1954 నాటి ఓ కారు సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తాలో కనిపించింది. మరమ్మతుల నిమిత్తం ఆటో వెనుక కట్టుకొని ముషీరాబాద్‌ నుంచి కార్ఖానాలోని షెడ్డుకు తరలిస్తుండగా కెమెరా కంట చిక్కింది. ఈ పురాతన కారు ఒక్కసారిగా రోడ్డుపై ప్రత్యక్షం కావడంతో ఇతర వాహనదారులు దానిని పరిశీలనగా చూస్తూ ముందుకు కదిలారు.

7/8

మాసబ్‌ట్యాంక్‌ మహావీర్‌ ఆస్పత్రి ఎదుట డివైడర్‌ గ్రిల్స్‌లో పాదచారులు ఇష్టారాజ్యంగా దూరి రోడ్డు దాటుతున్నారు. అందుబాటులో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా ఇలా ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు.

8/8

మానవాళి నుంచి కరోనా వైరస్‌ను తరిమేయాలని కోరుతూ ఫిలిప్పీన్స్‌లోని క్యూజొన్‌ సిటీలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల్లో తీసుకొచ్చిన శునకాలకు పవిత్ర జలాన్ని చల్లి దీవెనలు ఇస్తున్న పాస్టర్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని