‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/6

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్లే మార్గంలో రైతులు రోడ్డుపైనే తడిసిన మొక్కజొన్న పంటను ఆరబోశారు. అత్యంత నునుపుగా ఉండే ఈ గింజలపై టైర్లు ఎక్కితే వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉంది. ఇటీవలే ఓ కారు బోల్తాపడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి ధాన్యపు రాశులను తప్పించే క్రమంలో ఇదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఆ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

2/6

తాటిపండును ఒలిచి, వివిధ ప్రక్రియల తరువాత దానిని తేనెను పోలివుండే రసంలా తయారు చేసి నిల్వచేస్తున్న ఈ వృద్ధుడి పేరు కొర్లపాటి మోహన్‌రావు. గుంటూరు జిల్లా మంతెనవారిపాలెంకు చెందిన ఈయన ఐరన్‌, జింక్‌, విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే ఈ తాటి మిశ్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారా విక్రయిస్తున్నారు. ఈ పోషకాల గని తయారీ విధానం యువత నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

3/6

చెరువును తలపిస్తున్న ఈ రోడ్డు రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట జనచైతన్యకాలనీలోనిది. మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే ఇక్కడి ఇళ్లలోకి నీరు చేరుతోంది. క్రిమి కీటకాలు, దోమలతో అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

4/6

కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో ఇసుక కోసం వచ్చిన ట్రాక్టర్ల రద్దీ జాతరను తలపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తుంగభద్ర, హంద్రీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. జిల్లాలోని రీచ్‌లలో సుమారు 80వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొరత వెంటాడుతోంది. సి.బెళగల్‌ రీచ్‌ నీటిలో మునగడంతో ప్రత్యేక మోటార్ల ద్వారా ఇసుక తోడి పడవల్లో బయటకు తీసుకొస్తున్నామని సిబ్బంది తెలిపారు.

5/6

సుమారు ఏడు నెలల విరామం తరువాత హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ తెరుచుకుంది. మాస్క్‌లు ధరించి, సురక్షిత దూరం పాటిస్తూ జంతు ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందర్శకులు ఆహ్లాదంగా గడిపారు.

6/6

పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ కిర్గిస్థాన్‌లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఆ దేశ రాజధాని బిష్కెక్‌ నడిబొడ్డున పెద్దఎత్తున మోహరించి నినాదాలు చేశారు. అధికార పార్టీతో సత్సంబంధాలు కలిగిన రెండు పార్టీలకు ప్రారంభ ఫలితాల్లో మెజారిటీ సీట్లు రావడంతో ఓట్ల కొనుగోలు జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆందోళనను కట్టడి చేసేందుకు యత్నిస్తున్న పోలీసులపైకి అగ్గితో నింపిన ట్రాలీని తోస్తున్న నిరసనకారులను ఈ చిత్రంలో చూడొచ్చు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని