‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/8

సూర్యుడ్ని ఈ మనుషులు వీధి దీపంలా వాడుతున్నారా ఏంటి? అని పావురం తదేకంగా చూస్తున్నట్లు ఉంది కదూ! నల్లని మబ్బుల చాటుకు వెళుతూ రవి అస్తమిస్తున్న ఈ దృశ్యం ఖైరతాబాద్‌లో కనిపించింది.

2/8

భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని హిండన్‌ వైమానిక దళ స్థావరంలో సారంగ్‌ హెలికాప్టర్లతో ఇలా విన్యాసాలు ప్రదర్శించారు. వాయుసేన శక్తియుక్తులను చాటేలా తేజస్‌, జాగ్వర్‌, అపాచీ, చినూక్‌, సుఖోయ్‌, రఫేల్‌ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో చేసిన ఈ పరేడ్‌ ఆకట్టుకుంది.

3/8

ఇండోనేసియా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఈ వివాదాస్పద చట్టం కార్మికుల హక్కుల్ని హరించడమే కాకుండా పర్యావరణానికి సైతం హాని కలిగిస్తుందని ఆక్షేపిస్తూ కార్మికులతోపాటు యువత పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు.

4/8

ఎంసెట్‌లో తమ ర్యాంకులు గల్లంతు కావడాన్ని ప్రశ్నిస్తూ కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చుట్టుముట్టారు. ఎంసెట్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు.

5/8

రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ వద్ద రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారి మధ్యలో కూర్చొని సేద తీరుతున్న గోమాత

6/8

‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరు జీపీఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లను పంపిణీ చేశారు. సంచులను అందుకున్న ఆనందంలో చిందులు వేస్తున్న చిన్నారులు

7/8

మాదాపూర్‌ సైబర్‌ సిటీ పక్కనున్న ఓ భారీ అద్దాల భవంతిని గాల్లో వేలాడుతూ శుభ్రం చేసే పనిలో నిమగ్నమైన కార్మికులు

8/8

ప్రైవేటు వాహనాలు ఎక్కకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని సికింద్రాబాద్‌లో ప్రయాణికులను పిలుస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు వీరు. నగరంలో సిటీ బస్సుల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ బస్సుల్లో రద్దీ లేకపోవడంతో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని