‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/8

ఎక్కువ మందికి మాస్క్‌లు లేవు. సురక్షిత దూరం అసలే లేదు. మరి ఇంత మంది గుంపుగా చేరి ఎదురు చూస్తోంది ఎందుకో తెలుసా? ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా తెరిచేందుకు. కరోనా కాలంలో వీరందరికీ అంత అత్యవసరంగా ఖాతా తెరిచే అవసరం ఏమొచ్చిందనేగా మీ అనుమానం. ‘పోస్టాఫీసులో ఖాతా తెరవగానే మీ ఖాతాలో మోదీ డబ్బులు వేస్తారు’ అంటూ గత వారం రోజులుగా సికింద్రాబాద్ బస్తీల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో హెడ్‌ పోస్టాఫీసుకు జనం తండోపతండాలుగా వెళుతున్నారు. అలాంటిదేమీ లేదని జనాలకు నచ్చజెప్పడానికి అక్కడి సిబ్బంది తల పట్టుకోవాల్సి వస్తోంది.

2/8

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భాగ్యనగరంలోని ఇందిరా పార్కును సుమారు ఆరు నెలలపాటు మూసివేశారు. దీంతో పక్షుల కోసం ప్రత్యేకంగా గింజలు తీసుకెళ్లే సందర్శకులు అక్కడికి వెళ్లలేకపోయారు. సడలింపుల్లో భాగంగా పార్కును తెరవడంతో మళ్లీ సందర్శకులు గింజలు వేయడం మొదలుపెట్టారు. అవి తింటూ రామ చిలకలు ఖుషీ అవుతున్నాయి ఇలా.

3/8

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని నల్లమల అటవీప్రాంతంలో పొడవాటి కర్రకు సెల్‌ఫోన్‌ను వేలాడదీసి ఓ చిన్నారి సిగ్నల్‌ కోసం ఇలా ఎదురుచూస్తూ కనిపించాడు. ఫోన్‌లో మాట్లాడాలంటే ఇలా ఆరుబయట పాట్లు పడటం ఇక్కడ సాధారణమేనని స్థానికులు తెలిపారు.

4/8

‘అమ్మా తమ్ముడు మన్ను తినెన్‌..’ అంటూ ద్వాపర యుగంలో గోపాలుడు చేసిన లీలను తలపించేలా ఈ కలి యుగంలో కొన్ని గోవులు మట్టి తింటున్నాయి. ఎక్కడనుకుంటున్నారా? కర్నూలు జిల్లా సంగమేశ్వరం జానాలగూడెం నల్లమల అటవీప్రాంతంలో. గోవులకు జన్యుపరమైన లక్షణాల్లో తేడా, సరైన పోషకాలు అందకపోవడంతో ఈ విధంగా చేస్తాయని కొత్తపల్లి పశు వైద్యాధికారిణి భువనేశ్వరి తెలిపారు. దీన్ని పైకా బిహేవియర్‌గా పిలుస్తారని చెప్పారు. అడవిలోకి మేతకు వెళ్లినపుడు ఓ ఆవు ఇలా చేస్తే మిగిలిన ఆవులు కూడా ఈ పద్ధతిని కొన్నిసార్లు అనుకరించి ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు.

5/8

భీమిలి సముద్ర తీరానికి సందర్శకుల తాకిడి రోజురోజుకీ అధికమవుతోంది. లాక్‌డౌన్‌ అనంతరం పర్యాటక శాఖ కొన్ని ప్రాంతాల సందర్శనకు మాత్రమే వెసులుబాటు ఇవ్వడంతో విశాఖవాసులు సేద తీరేందుకు భీమిలి తీరాన్ని ఎంచుకుంటున్నారు.

6/8

సికింద్రాబాద్‌ బుద్ధభవన్‌ నుంచి నక్లెస్‌ రోడ్డు వెళ్లే దారిలో కొత్తగా సీసీ రోడ్డు వేస్తున్నారు. ఆ మార్గంలో వేగంగా వెళుతూ అదుపుతప్పి ఓ ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయాడు.‘రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి కావున వేగంగా వెళ్లొద్దని’ హెచ్చరిస్తూ సూచికలు ఏర్పాటు చేసినా వాహనదారులు పట్టించుకోవడం లేదు.

7/8

ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవలే కార్గో సేవలను ప్రవేశపెట్టింది. దీంతో దాదాపు రూ.10లక్షల ఆదాయం ఆర్టీసీకి సమకూరుతోంది. కానీ, ఈ సేవల్లో పనిచేసే సిబ్బందికి మాత్రం సరైన మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. హైదరాబాద్‌లో నిలిపి ఉంచిన ఓ సిటీ బస్సుకు బ్యానర్‌ కట్టి, పాదచారుల బాటపై వినియోగదారుల కోసం వేచి చూస్తున్న సిబ్బందిని చిత్రంలో చూడొచ్చు.

8/8

అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఓ కల్యాణ మంటపంలో కొవిడ్‌ 19 నిర్ధారణ పరీక్షలు చేయించుకొనేవారికి టోకెన్లు జారీ చేశారు. టోకెన్లు తీసుకునే వారు సురక్షిత దూరం పాటించేలా కుర్చీలు వేశారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని