‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/9

ఇక్కడ కనిపిస్తున్నది అల్లోసారస్‌ డైనోసార్‌ అస్థిపంజరం. అమెరికాలోని జాన్సన్‌ కౌంటీలో ఈ ఎముకల గూడును కనుగొన్నారు. ప్రస్తుతం దీన్ని పారిస్‌లోని డ్రౌట్‌ ఆక్షన్‌ హౌస్‌లో వేలానికి పెట్టారు. ఈ నెల 13న జరగబోయే వేలంలో ఈ ప్రాచీన అవశేషం ధర సుమారు 12 లక్షల యూరోలపైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

2/9

ద్విచక్రవాహనంపై అల్పాహారం అమ్ముకునే తమకు ట్రాఫిక్‌ పోలీసులు తరచూ జరిమానాలు విధిస్తున్నారని బహదూర్‌పురాకు చెందిన యువతులు చిత్ర, అశ్విని వాపోయారు. వయోభారం కారణంగా అమ్మానాన్నలు ఇంటివద్దే ఆహార పదార్థాలు తయారు చేసి ఇస్తుంటే.. వీధిలో అమ్ముతున్న తమకు ఈ వేధింపులు ఎదురవుతున్నాయని చెప్పారు. జరిమానా కట్టాలని ఓ పోలీసు ముందు బెదిరించి వెళ్లగా, మరో పోలీసు వచ్చి మాట్లాడి పరిష్కరించుకోవాలని ఆ చిరు వ్యాపారులకు సూచించాడు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కి కూతవేటు దూరంలోని పబ్లిక్‌ గార్డెన్‌ ప్రహరీ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.

3/9

హైదరాబాద్‌ నగర శివారులోని మంచాల మండలం బోడకొండ జలపాతం కనువిందు చేస్తోంది. ఇక్కడ వర్షపునీరు పాల నురగలా పరవళ్లు తొక్కుతూ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది.

4/9

ఈ చిత్రంలో కన్పిస్తున్నది ఏ మాదాపూరో, హైటెక్‌సిటీనో కాదు. మొన్నటి వరకూ వాహనదారులకు చుక్కలు చూపించిన ఎల్బీనగర్‌ కూడలి. ఇక్కడి నలువైపులా పైవంతెనలు, అండర్‌పాస్‌లు పూర్తికావడంతో ప్రయాణం సాఫీగా సాగిపోతోంది.

5/9

అంతర్‌ జిల్లా స్పౌజ్‌ బదిలీలు చేపట్టాలని కోరుతూ ప్రగతిభవన్‌కు బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. సుదీర్ఘకాలంగా బదిలీలు లేకపోవడంతో కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ 19 నేపథ్యంలో ప్రయాణాలు చేయడం కూడా కష్టతరంగా మారిందని, చిన్నారులతో కలిసి రోడ్డుపై నమస్కరిస్తూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.

6/9

సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో ఉప సభాపతి పద్మారావు చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. చీరలు అందుకోవాలనే ఆతృతలో వచ్చిన మహిళలు భౌతికదూరం పాటించకుండా గుమిగూడారు.

7/9

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక! ఇక్కడ కనిపిస్తోంది కేరళలోని తిరూర్‌ రైల్వే బుకింగ్‌ కార్యాలయం. రైల్వేశాఖ తన సహజశైలికి భిన్నంగా సుందరమైన చిత్రాలతో.. ప్రకాశవంతమైన రంగులతో ఈ కార్యాలయం సుందరీకరణ చేపట్టింది. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా అక్కడకు వెళితే బుకింగ్‌ కార్యాలయం ఎక్కడా అని అటూఇటూ తిరుగుతూ కంగారు పడొద్దు!

8/9

శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీ రోడ్లపైకి కొట్టుకొచ్చిన బండ రాళ్లు.

9/9

సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో శనివారం ఉదయం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంతాన్ని ముందే క్రిమిరహితం చేయాల్సి ఉండగా.. ఇలా మహిళలు, అధికారులు వస్తున్న సమయంలో రసాయన ద్రావణాలను చల్లడం మొదలు పెట్టారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని