‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/6

జోరువానలో ద్విచక్ర వాహనంపై వెళుతూ తల్లి ఒడిలో కూర్చొని చేతులు చాచి చినుకుల స్పర్శను ఆస్వాదిస్తున్న చిన్నారి. ఖైరతాబాద్‌ సర్కిల్‌ వద్ద కనిపించింది ఈ ముద్దులొలికే దృశ్యం.

2/6

అధిక వర్షపాతం ఉల్లి రైతులకు శాపంగా మారింది. కర్నూలు మండల పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి, పసుపుల ప్రాంతాల్లో సగానికిపైగా పంట వర్షం కారణంగానే పనికిరాకుండా పోయింది. పెట్టుబడిలో కొంతైనా వస్తుందనే ఆశతో బురదమయంగా మారిన ఉల్లిపంటను రైతులు ఆరబెడుతున్నారు.

3/6

హైదరాబాద్‌ నగరంలో భారీవర్షాలు కురుస్తున్నప్పటికీ కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. హుస్సేనీఆలంలో ఇటీవలే ఓ ఇల్లు కూలిపోయి ఇద్దరు మరణించారు. అదే ప్రాంతంలో చెట్లు మొలిచి, శిథిలమై మరికొన్ని భవనాలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అధికారులు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇక్కడ మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని స్థానికులు వాపోతున్నారు.

4/6

పిడుగు పడి తాటిచెట్టు కాలిపోతోందని అనుకుంటున్నారా.. అలాంటిదేమీ లేదు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలోని ఓన్‌జీసీ కేంద్రం చిమ్ని నుంచి వెలువడుతున్న మంట కెమెరా కన్నుతో ఇలా కనిపించింది.

5/6

దసరా నవరాత్రులు సమీపిస్తున్న నేపథ్యంలో ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ వద్ద అమ్మవారి విగ్రహాలను కొనుగోలు చేస్తున్న భక్తులు

6/6

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పంజాగుట్టలో ప్రధాన రహదారి పక్కనున్న దుకాణాలపై రసాయనాలను పిచికారి చేస్తున్న డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని