‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/5

కరోనా బారినపడి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం ఓర్లండో సాన్‌ఫోర్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్నికల సభలో పాల్గొన్నారు. తాను కరోనాను జయించిన ఆనందమో.. ఏమో తెలియదు కానీ ఆయన ఒక్కసారిగా తన చేతిలోని మాస్క్‌ను జన సందోహంలోకి విసిరేశారు. తొలి నుంచి మాస్క్‌ ధరించడం పట్ల ట్రంప్‌ విముఖత చూపిస్తున్నారు.

2/5

పంట వ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయంగా పూసా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చక్కటి పరిష్కారాన్ని కనుగొంది. పంట వ్యర్థాలను కుళ్లబెట్టి ఎరువుగా మార్చే సరికొత్త ద్రావణాన్ని తయారు చేసింది. కోతలు పూర్తయిన పిదప పొలంలో ఆ ద్రావణం పిచికారి చేస్తే వ్యర్థాలన్నీ కుళ్లి ఎరువుగా మారతాయని తయారీదారులు పేర్కొన్నారు. ఈ ప్రయత్నానికి దిల్లీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. దీంతో ఏటా చలికాలంలో ఉత్తరాదిలో పెరుగుతున్న కాలుష్యానికి కళ్లెం వేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

3/5

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన పోలీసులు వీరు. తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే.. వానలో తడవకుండా ఉండేందుకు ఇలా ప్లాస్టిక్‌ కవర్లను అడ్డు పెట్టుకున్నారు.

4/5

నగరంలో రెండ్రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. దీంతో సాగర్‌లోని నీటిని అధికారులు గేట్ల ద్వారా బయటకు విడుదల చేస్తున్నారు.

5/5

ఆదిలాబాద్‌ పట్టణంలోని కిసాన్‌ చౌక్‌లో ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయడం లేదు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌ ఇలా ముఖ్యమైన ప్రదేశాలకు చేరుకోవాలంటే ఈ కూడలి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరిగే ఇక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్‌ లేకపోవడంతో గతంలో ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు సిగ్నల్‌ ఉన్నా అది మరమ్మతులకు గురైంది. దీంతో మళ్లీ వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు సత్వరమే స్పందించి ఈ లోపాన్ని సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని