‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/6

ఈ చిత్రంలోని మహిళను చూస్తుంటే.. కారు దిగడానికి కాస్త బద్ధకించి పోస్టుబాక్సులో లెటర్‌ వేస్తున్నట్లుగా అనిపిస్తోంది కదూ! కానీ ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుంటోంది. లిథుయేనియాలోని విల్నియస్‌లో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా స్వీయ ఏకాంతంలో ఉన్న వారు ఇలా డ్రైవ్‌ ఇన్‌ పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసి వెళ్లారు.

2/6

మేఘాల్లో మొక్కలు మొలిచినట్లుగా కనిపిస్తున్న ఈ అపురూప దృశ్యం జర్మనీలోని బెర్న్‌బ్యూరెన్‌ నగరంలోనిది. శంఖాకారంలో ఏపుగా పెరిగే కొన్ని చెట్ల సౌందర్యాన్ని.. ఉదయం వేళ అలముకున్న దట్టమైన పొగమంచుతో కలిపి డ్రోన్‌ ద్వారా ఈ విధంగా చిత్రీకరించారు.

3/6

భాగ్యనగరంలో సోమవారం ఎండ, వాన దోబూచులాట తారసపడింది. ఖాజాగూడలో సాయంత్ర వేళ భారీవర్షం కురుస్తుండగా.. అదే మార్గంలోని నానక్‌రాంగూడ వైపు సూర్యుడు అస్తమిస్తూ కనిపించాడు.

4/6

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వచ్చిన వరదలతో హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబానగర్‌ వాసులు సర్వం కోల్పోయి వీధినపడ్డారు. ఆహార పదార్థాలను పంపిణీ చేయడానికి వచ్చిన వారిని తమకు సాయం చేయాల్సిందిగా ఇలా వేడుకుంటూ కనిపించారు.

5/6

థాయిలాండ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాచరిక పాలనకు చరమగీతం పాడి, ప్రధాని రాజీనామా చేయాలని కోరుతూ బ్యాంకాక్‌లోని కాసెట్‌ కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా నిరసనకారులు అంతా కలిసి మూడువేళ్లతో సెల్యూట్ చేశారు. వీరి ప్రచారాన్ని అడ్డుకునేందుకు స్థానిక ప్రభుత్వం ఆందోళనకారుల టెలిగ్రామ్ అకౌంట్లను బ్లాక్‌ చేసినట్లు తెలిసింది.

6/6

ఇంట్లో గోడలపై కనిపించే బల్లులు సాధారణంగా దోమలు, చిన్నచిన్న పురుగుల్ని మాటువేసి తినేస్తాయి. ఇందుకు భిన్నంగా ఆకలి బాధ తాళలేక ఓ బల్లి మరో బల్లిని నోట కరచుకొని మెల్లగా మింగేసిన దృశ్యం రాజమహేంద్రవరంలో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. పాములు, కీటకాలు తదితర జీవుల్లో ఈ రకమైన స్వజాతి భక్షణ ఉంటుందని జంతుశాస్త్ర విభాగ అధ్యాపకులు కె.బాబు తెలిపారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని