‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/5

అదేంటి.. ఆ చిన్నారులను తాళ్లతో కట్టేసి ఎక్కడికి తీసుకెళుతున్నారని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి! వారిని తీసుకెళ్తోంది మాత్రం కచ్చితంగా పాఠశాలకే. ఇటలీలోని బెల్లూస్కోలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు సురక్షిత దూరం పాటించేందుకు ఈ చర్యలు చేపట్టారు. సురక్షిత దూరం పాటిస్తూ..తాడు పొడవునా చిన్నారులు పట్టుకునేందుకు హ్యాండిల్‌ ఏర్పాటు చేశారు. వారిని పర్యవేక్షిస్తూ పాఠశాల వరకూ విడిచి రావడానికి కొంతమంది వలంటీర్లు కూడా ఉండటం మరో విశేషం.

2/5

అది ఒంగోలు నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి. ఉదయం వేళ ఓ కుక్క తన రెండు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఇంతలో వేగంగా వస్తున్న లారీలు వాటిపై నుంచి దూసుకెళ్లాయి. దీంతో రెండు కుక్కలు చనిపోయాయి. అందులో ఓ చిన్న కుక్క మాత్రమే ప్రమాదం నుంచి బయటపడింది. చనిపోయిన తన తల్లి ఇక తిరిగిరాదని తెలియక ఆ శునకం.. మృతదేహం పక్కనే దీనంగా ఉండిపోయింది. మళ్లీ వాహనాలు తనపైకి వస్తాయనే స్పృహలేని ఆ మూగజీవి ఇలా జాలి చూపులు చూస్తోంది. అటుగా వచ్చిన వారు ఆహారం పెట్టినా తినకుండా ఆ శునకం తల్లి దగ్గరే పడుకోవడం ప్రత్యక్షంగా చూసిన హృదయాలు ద్రవించాయి.

3/5

కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రాంతంలోని పంట పొలాల్లో జింకలు అధికంగా సంచరిస్తున్నాయి. వీటి గుంపులు తీసే పరుగు కారణంగా కొన్నిసార్లు ఆరంభ దశలోని మొక్కలు పైకి ఎదగడం లేదు. వన్యప్రాణి సంరక్షణ చట్ట పరిధిలోకి వచ్చే ఈ జంతువుల బెడదకు అధికారులే తగిన పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

4/5

ఈ చిత్రంలో కన్పిస్తున్న నిర్మాణ ఆకృతి, అందులోని దేవతా ప్రతిమలు చూసి ఏదో ఆలయమని అనుకోవద్దు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుల్లాపల్లి పారిశ్రామిక వాడ వద్ద ఓ భవన యజమానికి దేవుళ్లపై ఉన్న భక్తికి ప్రతిరూపమే ఈ భవంతి. భవనం ముందు భాగంలో సీతారాములు, గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడు, హనుమంతుడి విగ్రహాలతో సృష్టించిన ఈ నిర్మాణం ఆ దారి వెంట వచ్చిపోయే చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

5/5

భారీ వరదలతో కంటోన్మెంట్‌లోని బాపూజీనగర్‌ ప్రధాన రహదారిపై ఓ చోట గుంత పడింది. అటుగా వచ్చే వాహనాలు అందులో పడిపోకుండా హెచ్చరికగా ఓ సెక్యూరిటీ గార్డు ఇలా కుర్చీ ఏర్పాటు చేశారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని