‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/6

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సినిమా ప్రదర్శనలకు వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావడం లేదు. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని ఓ థియేటర్‌ ప్రేక్షకులు లేక ఇలా వెలవెలబోతూ కనిపించింది.

2/6

పెరూలో డెంగీ విజృంభిస్తోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం మూడురెట్లు అధికంగా కేసులు నమోదైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. కొంతమంది కరోనా బాధితులకు కూడా ఈ వ్యాధి సోకింది. ఈ నేపథ్యంలో వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా దోమ ఆకారంలో సూట్‌ ధరించి.. దోమల నివారణకు ఉపయోగించే పొగలో నుంచి బయటకు వస్తున్న ఓ వేషధారిని ఈ చిత్రంలో చూడొచ్చు.

3/6

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవలే నిర్బంధం నుంచి విడుదలయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె శుక్రవారం మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మెహబూబా ఏం మాట్లాడుతుందోనని ఆమె కూతురు ఇల్తిజా ఆసక్తిగా వింటూ కనిపించారు. తల్లి నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఇల్తిజా సామాజిక మాధ్యామాల్లో చురుగ్గా గళం వినిపించారు.

4/6

హైదరాబాద్‌ నగరం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం హనుమాన్‌నగర్‌ ఇంకా వరదనీటిలోనే చిక్కుకుని ఉంది. దాదాపు పదిరోజులు గడుస్తున్నా ఆ ప్రాంతంలో వరదనీరు తొలగిన దాఖాలలు లేవు. ఇప్పట్లో వరద తగ్గదని భావించిన పలువురు స్థానికులు ఇంట్లోని సామగ్రిని వేరే ప్రాంతాలకు తీసుకెళుతున్నారు.

5/6

లాక్‌డౌన్‌ కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు ఉపాధి కోసం తిరిగి హైదరాబాద్‌ నగరానికి వస్తున్నారు. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన కూలీలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కనిపించారు.

6/6

దసరా పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు కుటుంబంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చిన పలువురు ప్రయాణికులు కరోనాబారిన పడకుండా ఫేస్‌షీల్డ్‌లు ధరించి కనిపించారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని