‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/11

పచ్చని వరిచేలు.. గట్టున కొబ్బరి చెట్లు.. చుట్టూ పొగమంచు. ఇదేదో వేకువజామున కనిపించే దృశ్యం అనుకుంటే మీరు పొరబడ్డట్లే! తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ వద్ద పొలాల్లో ఈ ఆహ్లాదకర హిమసోయగం మిట్ట మధ్యాహ్నం వేళ ప్రత్యక్షమైంది.

2/11

ఇక్కడ కనిపిస్తోంది ‘మర్డర్‌ హార్నెట్‌’ అనే కందిరీగ. దాదాపు ఐదు సెంటీమీటర్ల పొడవుండే ఈ కందిరీగలు సాధారణంగా మనుషులపై దాడిచేయవు. కానీ, తేనెటీగల గూళ్లు కనిపిస్తే మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టవు. తేనెటీగల తలలు కొరికి వాటి గూటిలోనే తిష్ట వేస్తాయి. వాషింగ్టన్‌కు సమీపంలోని బ్లైన్‌లో ప్రత్యక్షమైన ఈ కీటకాలను మట్టుబెట్టేందుకు అధికారులు పట్టుబడిన వాటిలో కొన్నింటికి ప్రత్యేకంగా ట్రాకింగ్‌ డివైజ్‌లను అమర్చారు. తద్వారా వాటి సామ్రాజ్యాన్ని పసిగట్టి సమూలంగా నిర్మూలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

3/11

స్వీడన్‌లోని విస్బైలో నిర్వహించిన గాట్లాండ్‌ గ్రాండ్‌ నేషనల్‌ పోటీల్లో బురదలో ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేస్తూ ముందుకు సాగుతున్న రేసర్లు

4/11

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పల్ నుంచి రామాంతపూర్‌ వెళ్లే మార్గంలోని రోడ్డు భారీగా కోతకు గురైంది. కాలువ కోసం గొయ్యి తీసి ఉంటారేమోనని భావించేలా ఆ రోడ్డు దర్శనమిస్తోంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

5/11

అకస్మాత్తుగా వచ్చిన వరద కారణంగా హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబానగర్‌లో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. దానిని తొలగించేందుకు వచ్చే అధికార యంత్రాంగం కోసం వేచి చూడకుండా స్థానిక యువత స్వచ్ఛందంగా నడుం బిగించారు. ఆరురోజులుగా పారలు చేతబూని రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక యువతకు తోడు ఇతర జిల్లాల నుంచి వచ్చిన తెహ్రీక్‌ నిడా ఎ ఇస్లాం సహాయ బృందం కూడా ఈ క్రతువులో చేయి కలిపింది.

6/11

ఈ చిత్రంలోని వృద్ధురాలు ఆప్యాయంగా మాట్లాడుతున్న గుర్రం పేరు టోని. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలోని ఓ నర్సింగ్‌ హోంలో గోలియాస్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఇలాంటి మరికొన్ని జంతువులను తెచ్చి వదిలింది. అసలే నామమాత్రంగా వచ్చిపోయే కుటుంబ సభ్యులు.. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇక్కడకు రావడమే మానేశారు. దీంతో ఆ వృద్ధులకు సాంత్వన చేకూర్చాలని ఈ మూగజీవాలను వారికి దగ్గర చేశారు ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు.

7/11

బహిరంగ మార్కెట్‌లో ఉల్లిధర మండిపోతోంది. దీంతో ప్రభుత్వమే తక్కువ ధరకు రైతుబజార్లలో రాయితీ ఉల్లిని విక్రయిస్తోంది. ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డు కూడలిలోని రైతుబజారులో ఉల్లి కొనుగోలు చేసేందుకు బారులు తీరిన వినియోగదారులు.

8/11

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో జూబ్లీ బస్ స్టేషన్లో ప్రయాణికులతో తీవ్ర రద్దీ నెలకొంది.

9/11

కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవానీ మాలధారులు దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పూర్ణకుంభం కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు.

10/11

దసరా పండగకు సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు ఆశించిన మేర బస్సులు దొరకలేదు. దీంతో ఉప్పల్‌ వద్ద పలువురు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

11/11

ఒంగోలులోని కర్నూలు రోడ్డు కూడలిలో గ్రానైట్‌ రాయి లోడుతో వెళుతున్న లారీ ఓ కారును వెనక నుంచి స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమై వాహనాలను తప్పించారు. ప్రతిరోజూ ఈ మార్గంలో వందలాది లారీలో వేగంగా వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని