చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పే విశేషాలు

1/11

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ జిల్లా ఆనందపురం మండలం కణామం గ్రామంలో పర్యటించారు. స్థానికంగా రైతులు పండించే పంటలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఓ పొలంలో దిగి ఆయనే స్వయంగా పురుగుమందు పిచికారీ చేశారు.

2/11

రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలోని హుకుంపేట పంచాయతీ సావిత్రినగర్‌లో ఓ పిచ్చుక కార్‌ సైడ్‌ మిర్రర్‌పై వాలి కనిపించింది. అద్దంలో తనని తాను చూసి మురిసిపోతోందా అన్నట్లుగా ఈ చిత్రం ఉంది.

3/11

ఖైరతాబాద్‌లో రయ్‌రయ్‌మంటూ సాగిపోతున్న కారులో నుంచి ఓ పెంపుడు శునకం ఇలా బయటకు చూస్తూ దర్జా ప్రదర్శించింది.

4/11

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున జూబ్లిహిల్స్‌లో మొక్కలు నాటారు. అనంతరం వాల్గొ ఇన్‌ఫ్రా సీఈవో శ్రీధర్‌రావుతో కలిసి సొసైటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

5/11

భాగ్యనగరంలో చలి తీవ్రత రోజురోజుకీ అధికమవుతోంది. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలైనా కూడా సూర్యుడు కనిపించలేదు. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో మబ్బులు కమ్ముకున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే వాతావరణం నెలకొంది.

6/11

అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కథానాయకులుగా తెరకెక్కుతున్న హాస్యరస చిత్రం జాతిరత్నాలు. హీరో నవీన్‌ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది.

7/11

తనపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైకాపా నాయకులు సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి సవాలు విసిరారు. ఈరోజు ఆలయంలో ప్రమాణం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్దకు తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకోగా పోలీసులు వీరిని నిలువరించారు. వైకాపా తరఫున విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి విజయనిర్మల ప్రమాణానికి సిద్ధమై వెలగపూడి కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

8/11

26-12-2004.. చైన్నై సముద్ర తీరంలో భీకర సునామీ సంభవించి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయిన రోజు. ప్రకృతి విలయతాండవానికి బలయిన మృతులకు చెన్నై బీచ్‌లో వారి బంధువులు నేడు నివాళులర్పించారు. తమ వారిని జ్ఞాపకాలను నెమరువేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

9/11

వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో వేద పండితులు చక్రస్నానం నిర్వహించారు. దాదాపు 9నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయ పుష్కరిణిలో ఈ క్రతువు చేపట్టారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10/11

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఈవో జవహర్‌రెడ్డి ఆమెకు స్వామివారి ప్రసాదం అందజేయగా.. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

11/11

భద్రాద్రి కొత్తగూడెం చంద్రుగొండ మండలానికి చెందిన బెండాలపాడు గ్రామానికి చెందిన పొడియం రాధాకృష్ణ, అరుణ దంపతులకు కుమార్తె నాగేంద్ర(15), కుమారుడు రాజు సంతానం. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న నాగేంద్ర ఏడాది వయసు నుంచే అన్నం తినడం మానేసింది. రోజులో మూడుసార్లు చిరుతిండితోనే కడుపు నింపుకొంటోంది. అన్నం అలవాటు చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. వాంతులు చేసుకుంటుండటంతో చివరికి మిక్చరే పెడుతూ వస్తున్నామని’ బాలిక తండ్రి వివరించారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని