చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పే విశేషాలు

1/15

తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. స్వామివారిని పల్లకీపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు.

2/15

హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ప్రతాపరుద్రుడి నాటకాన్ని ప్రదర్శించారు. కాకతీయుల కాలం నాటి సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపారు. కార్యక్రమం ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది.

3/15

గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే నూతన సంవత్సర వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1న ఇళ్ల ముందు వేసే ముగ్గుల కోసం రంగులను విక్రయిస్తున్న మహిళలు హైదరాబాద్‌లో కనిపించారు.

4/15

ఓ బాతు తన పిల్లబాతుల ఆకలి తీర్చడానికి చిన్న చిన్న చేపపిల్లలను పట్టుకొని తినిపిస్తూ వాటికి వేట నేర్పిస్తోంది. కూకట్‌పల్లి రంగధాముని చెరువులో ఈ చిత్రం కనిపించింది.

5/15

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అధికారులు పదేపదే చెబుతున్నా చాలా మంది వినడం లేదు. సంజీవయ్య పార్క్‌ సమీపంలో ట్రాక్‌ మరమ్మతుల కోసం రైల్వే ఉద్యోగి ద్విచక్రవాహనం వెనక వెల్డింగ్‌ చేసే సిలిండర్‌ను ఇలా కట్టుకొని వెళ్లాడు.

6/15

ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ అభయహస్తం అందిస్తున్న నటుడు సోనూసూద్‌పై ‘ఐయామ్‌ నో మెస్సయ్య’ అనే పుస్తకాన్ని మీనా.కె అయ్యర్‌ రచించారు. ఆచార్య షూటింగ్‌లో భాగంగా ఆ పుస్తకాన్ని సోనూసూద్‌ మెగాస్టార్‌ చిరుకు అందించారు. చిరు ఆయనకు అభినందనలు తెలిపి ఇలాగే అభాగ్యులకు సహాయపడుతూ ఎంతోమందికి ప్రేరణగా ఉండాలని కోరారు.

7/15

ప్రముఖ క్రికెటర్‌ రోహిత్‌శర్మ సతీమణి రితిక తమ కూతురు సమైరా రెండో పుట్టిన రోజు పురస్కరించుకొని ఇన్‌స్టా వేదికగా చిన్నారి ఫొటోలను షేర్‌ చేశారు. చూస్తుండగానే చిన్నారికి రెండేళ్లు నిండాయని పోస్టు చేయడంతో పాటు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

8/15

హైదరాబాద్‌ ఫిలింసిటీలోని ఓ రెస్టారెంట్‌లో న్యూఇయర్‌ మస్తీ వేడుకలు నిర్వహించారు. పలువురు సీరియల్ నటీమణులు, సెలిబ్రిటీలు హాజరై ఫొటోలకు ఫోజులిచ్చారు.

9/15

వాషింగ్టన్‌లో మోడెర్నా కొవిడ్‌-19 టీకా తీసుకున్న అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌.

10/15

ప్రకాశం జిల్లా భైరవకోన ప్రాంతంలో సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తులో పెరిగే అరుదైన మొక్క జాతిని పరిశోధకులు గుర్తించారు. తూర్పు కనుమల్లోనే కన్పించే ఈ మొక్క 10 సెంమీ ఎత్తు పెరుగుతుంది. సూర్యకాంతి ఉన్నప్పుడే ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్యే వికసించి తర్వాత ముడుచుకుంటాయి.

11/15

కరోనా కారణంగా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న షెడ్లులోకి ఓపీ వైద్యం కోసం వచ్చే రోగుల్ని, వారి సహాయకుల్ని అనుమతించకపోవడంతో.. ఆసుపత్రి ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌పై చలికి ఓ రోగి పడుతున్న ఇక్కట్లు.

12/15

పాత ట్రాలీ ఆటోని కొన్ని మరమ్మతులు చేయించి.. మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద ఛాట్‌ బండిలా నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ చిరు వ్యాపారి.

13/15

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వద్ద రాజీవ్‌ రహదారి సమీపంలో భగీరథ పైపులైను పగిలిపోవడంతో జలధార ఉవ్వెత్తున ఎగిసిపడింది.

14/15

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మంగళవారం వటపత్రశాయిగా దర్శనమిచ్చారు. స్వామి వారు మర్రి ఆకులో పవళించే సన్నివేశాన్ని తిలకించి భక్తులు పరవశించారు.

15/15

కడప జిల్లా రైల్వేకోడూరులో విద్యుత్‌, డ్రిప్‌ పరికరాలను విక్రయించే రామకృష్ణారెడ్డి దుకాణానికి రోజూ ఓ ఆవు వచ్చి.. వ్యాపారి అందించే పండ్లు, కూరగాయలు తిని వెళ్తుంది. మంగళవారం వ్యాపారి పనిలో ఉండడంతో ఆవుకు ఆహారం అందించడం కాస్త ఆలస్యమైంది. దీంతో ఆవు దుకాణంలోకి వెళ్లి నిరీక్షించింది.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని