చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పే విశేషాలు

1/15

ఆస్ర్టేలియాలో నూతన సంవత్సరం వచ్చేసింది. సిడ్నీలోని ఒపెరా హౌస్‌, హార్బర్‌ బ్రిడ్జి వద్ద భారీ స్థాయిలో బాణసంచా పేల్చి వేడుకలు ప్రారంభించారు.

2/15

నూతన సంవత్సర వేడుకల కోసం కరీంనగర్‌లోని ఓ బేకరీలో సిద్ధం చేసిన వివిధ రకాల హాట్‌ కేకులు.. కొనుగోలుదారుల సందడి

3/15

బేగంపేట‌ ప్రధాన నాలా చుట్టుపక్కల హెచ్‌ఎండీఏ పచ్చని మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతోంది. అటుగా వెళ్లేవారు పరిసరాలను చూసి ముగ్ధులవుతున్నారు.

4/15

రేపటి రోజుతో కొత్త సంవత్సరంతోపాటు కొత్త దశాబ్దంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో తీసిన 2020 చివరి సూర్యాస్తమయ దృశ్యాలివి.

5/15

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ అనే యువకుడు బియ్యం గింజలపై 0.2మిల్లిమీటర్ల వ్యాసంతో 2021 అని రాసి ప్రతిభ చాటాడు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

6/15

నార్వే రాజధాని ఓస్లోకు సమీపంలోని ఆస్క్‌ నివాస సముదాయాలపై ఓ భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో కొన్ని గృహాలు శిథిలాల్లో చిక్కుకుపోయాయి. సుమారు 10మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10మంది ఆచూకీ తెలియరాలేదు. వారి జాడ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోసారి ఇలా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో సుమారు 700మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

7/15

కోటి ఆశలతో కొంగొత్తగా ప్రారంభించాల్సిన నూతన సంవత్సరాన్ని జైలు జీవితంతో మొదలు పెట్టొద్దంటూ వినూత్న సందేశమిచ్చారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని చెబుతూ.. డ్రంక్‌&డ్రైవ్‌లో పట్టుకున్న వాహనాలు ఎలా మాట్లాడుకుంటాయనే విషయాన్ని ఫన్నీగా వివరిస్తూ ట్విటర్‌లో ఈ చిత్రాన్ని పోస్టు చేశారు.

8/15

లండన్‌లోని ఆకాశహర్య్మాలపై నుంచి చూసినప్పుడు నిండు చంద్రుడు ఇలా భారీగా కనువిందు చేశాడు.

9/15

అమెరికా కన్సాస్‌ రాష్ట్రంలోని టొపెకాలో చంద్రుడి వెలుగులో కన్సా వారియర్‌ విగ్రహం ఇలా ఆకట్టుకుంది. నిజంగానే అక్కడ ఓ వీరుడు ఆకాశానికి విల్లు ఎక్కు పెట్టాడా అనిపించేంత సహజత్వం ఉట్టిపడుతోంది.

10/15

మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భౌగోళిక వ్యత్యాసం కారణంగా కొన్ని దేశాలు మనకన్నా ముందే కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. న్యూజిలాండ్‌కు ఆ ఛాన్స్‌ ఉంది. అక్కడ ఉత్సాహంగా ఈ 2020 వీడ్కోలు సంబరాలు జరుపుకొంటున్న దృశ్యాలే ఇవి.

11/15

తెలంగాణ నలుమూలలకు ఐటీ రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఇటీవలే ఖమ్మంలో నూతన ఐటీ హబ్‌ను ప్రారంభించారు. ఈ సౌధంలోని సావరీన్‌ సొల్యూషన్స్‌ పూర్తిగా స్థానిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ‘ఐటీ హబ్‌ ఖమ్మం’ యాప్‌ను రూపొందించింది. నూతన యాప్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించారు.

12/15

వికారాబాద్‌ జిల్లా జుంటిపల్లిలో 23 అడుగుల అభయాంజనేయస్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద హనుమాన్‌ ఏకశిలా విగ్రహమని గ్రామస్థులు తెలిపారు.

13/15

బీర్‌భూం జిల్లా పర్యటనలో భాగంగా శాంతినికేతన్‌ సమీపంలోని ఓ గిరిజన గ్రామం వద్ద చుల్హాపై వంటసాయం చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

14/15

వరంగల్‌ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామంలో ఓ రైతు పెరటిలో కాసిన సొరకాయ.. ఏకంగా ఐదున్నర అడుగుల పొడవు పెరిగింది. గ్రామస్థులు దీన్ని ఆసక్తిగా తిలకించారు.

15/15

పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో మట్టితో చేసిన వస్తువులపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన ఓ మట్టిపాత్రల దుకాణంలో తాజాగా మట్టి కూలర్లు కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటున్నాయి.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని