‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/15

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌ వాసులు చాలా మంది తమ పనులకు సెలవు చెప్పి వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. కొందరు నెక్లెస్‌ రోడ్డులోని లవ్ హైదరాబాద్‌ వద్ద ఇలా ఫొటోలు దిగుతూ కనిపించారు.

2/15

బషీర్‌బాగ్‌ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల క్రికెట్‌ పోటీలను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో షూటర్‌ ఈషా సింగ్‌ పాల్గొన్నారు.

3/15

చార్మినార్‌ పరిధిలోని ఓ ఇంటి ముంగిట్లో మహిళ ముగ్గు వేస్తుంటే.. ఉయ్యాల్లో కూర్చొని శ్రద్ధగా గమనిస్తున్న ఆమె చిన్నారి

4/15

సాధారణంగా భోగి మంటలు సంక్రాంతి వేళ ఊరూరా కనిపిస్తాయి. ఇందుకు భిన్నంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలం వాడూర్‌ గ్రామంలో మాత్రం మూడు నెలల పాటు భోగిమంటల మాదిరి చలిమంటలు కాచుకుంటారు. ఈ గ్రామం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న అర్లి(టి) గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం.

5/15

ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ రచించి, ఆలపించిన దివంగత ఆచార్య జయశంకర్‌ స్ఫూర్తి గీతాన్ని మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పాత్ర ఈ పాటలో ప్రతిబింబిస్తోందని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు.

6/15

నూతన సంవత్సరం సందర్భంగా చార్మినార్‌ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

7/15

పాజిటివ్‌ సమయాన్ని గడిపేందుకు కరోనా టెస్టులో నెగెటివ్‌ వచ్చిన స్నేహితులంతా ఒక చోట చేరామని టీమ్ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు. హార్దిక్‌ పాండ్య, మరో ఇద్దరు స్నేహితుల కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుక జరుపుకొంటున్న చిత్రాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

8/15

రీల్‌ లైఫ్‌ విలన్‌.. రియల్‌ లైఫ్‌ హీరో సోనూసూద్‌ తన జీవిత అనుభవాలను పంచుకుంటూ ‘ఐయామ్ నో మేసయ్య’ పుస్తకాన్ని రచించారు. సోనూ స్వయంగా కౌన్‌ బనేగా కరోడ్‌పతి సెట్‌కు వెళ్లి బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌కు ఈ పుస్తకం అందజేశారు.

9/15

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనకు వెలకట్టలేని కానుక పంపించారని వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ఈ చిత్రం బ్రహ్మానందం స్వయంగా 45 రోజులపాటు కృషిచేసి గీసిన పెన్సిల్‌ స్కెచ్‌ అని చెబుతూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

10/15

హైదరాబాద్‌: కొత్త ఏడాదిని పురస్కరించుకొని బిర్లా టెంపుల్‌ను భక్తులు సందర్శించారు. అక్కడ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

11/15

నూతన సంవత్సర వేడుకలను మనాలీ సమీపంలోని కులు లోయలో చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో బారులు తీరిన కార్లు.

12/15

‘కాలు విరిగి కట్లు.. చలితో ఇక్కట్లు’ శీర్షికన ‘ఈనాడు’ పత్రికలో ప్రచురితమైన చిత్ర వార్తకు.. మనం ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ స్పందించింది. గాంధీ ఆసుపత్రి బయట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న రోగులు, వారి సంబంధీకులకు సంస్థ సభ్యులు రగ్గులు పంపిణీ చేశారు.

13/15

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ ఉపరితల గని నుంచి తీసిన మట్టిని ఖాళీ స్థలంలో గుట్టలుగా పోశారు. ఆ గుట్టల చుట్టూ సింగరేణి అధికారులు పచ్చదనాన్ని పెంచుతున్నారు. పచ్చందాలు.. పైనున్న మబ్బులతో కలిసినట్టున్న ఈ దృశ్యం ఆ ప్రాంతానికి ప్రత్యేక అందాన్ని తీసుకువచ్చింది.

14/15

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫా ఇలా మెరిసింది.

15/15

తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఓ నర్సరీలో మొక్కల కూర్పుతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ను నిరోధించేందుకు టీకా సూది మందు ప్రత్యేకతను వివరిస్తూ ఇలా తీర్చిదిద్దారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని