చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పే విశేషాలు

1/20

నంద్యాలకు చెందిన అబ్బాస్‌ అలీ అనే రైతు కౌలుకు తీసుకొని వేసిన తమలపాకు పంట పూర్తిగా ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. రెండున్నర ఎకరాల్లో రూ.8లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. తెగుళ్లు వ్యాపించి పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది.

2/20

విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్ర సందర్శనకు వెళ్లిన చంద్రబాబుకు రాముడి విగ్రహం ధ్వంసమైన ఘటనను వివరిస్తూ కన్నీటి పర్యంతమైన అర్చకుడు

3/20

ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రూక్‌లో స్కైజంపింగ్‌ పోటీల్లో పాల్గొని విన్యాసాలు ప్రదర్శిస్తున్న క్రీడాకారులు

4/20

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగెండ్ల ముడుపులోని ఆ కుటుంబం ప్రతి సంవత్సరం ఒంగోలు నగరంలో ఆవులు, గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పి పొట్టపోసుకునేవారు. వాళ్ల ఆవు లక్ష్మి ఏడు రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. శనివారం అకస్మాత్తుగా గోవు మృతి చెందింది. దీంతో యజమాని బాలమ్మ లేగదూడను పట్టుకుని హృదయవిదారకంగా రోదించింది.

5/20

హైదరాబాద్‌ ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్‌ సమీపంలోని డంపింగ్‌ యార్డుకు చెత్త సేకరించిన వాహనాలు వస్తుంటాయి. అయితే ఇక్కడ వ్యర్థాలను పారబోసేందుకు ఆ ఆటోలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. సహనం కోల్పోయిన కొందరు కార్మికులు చెత్తను రోడ్డుపై పారబోసి వెళ్తున్నారు.

6/20

చాదర్‌ఘాట్‌ వంతెన రక్షణ గోడపై ఓ యువకుడు ప్రమాదకరంగా కూర్చొని చరవాణిలో మాట్లాడుతూ.. శీతల పానీయం తాగుతూ కనిపించాడు.

7/20

నిమ్స్‌-పంజాగుట్ట మార్గంలో భారీ ట్రాఫిక్‌ జాం కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అదే మార్గంలో వచ్చిన అంబులెన్స్‌ సైరన్‌ చేస్తున్నా ముందున్న వాహనాలు పక్కకు జరగలేని పరిస్థితి నెలకొంది.

8/20

ఆదిలాబాద్‌లోని పాత జాతీయ రహదారి పై శిరస్ర్తాణం పెట్టుకోకుండా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడిని ట్రాఫిక్ కానిస్టేబుల్‌ ఫొటో తీశారు. ఇంతలోనే మరోవైపు ట్రాక్టర్‌ను నడుపుతున్న చోదకుడు ఫోన్‌ మాట్లాడుతుండటంతో గమనించలేకపోయాడు. ఒక్క వ్యక్తి మాత్రమే అన్నీ ఎలా చూడగలడు. వాహనదారులు కూడా బాధ్యతగా నడుచుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

9/20

స్మార్ట్‌సిటీల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని అధికార తెరాస ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపిస్తూ కరీంనగర్‌లో భాజపా శ్రేణులు ధర్నాకు దిగాయి. ఆ నిధులను వెంటనే విడుదల చేసి స్మార్ట్‌సిటీ పనులను వేగవంతం చేయాలని నినాదాలు చేస్తూ భాజపా కార్యకర్తలు నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు ఆ చర్యను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన కొనసాగించారు.

10/20

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌‌కుమార్‌ చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వెలసిన పల్లి కొండేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

11/20

విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థాన్ని తెదేపా అధినేత చంద్రబాబు సందర్శించారు. ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని, కోనేరును పరిశీలించారు. అర్చకులు, స్థానిక నాయకులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

12/20

చిత్తూరులోని ఏఆర్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ‘రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌-2020’ నిర్వహణ కోసం సన్నద్ధమయ్యారు. పోలీసులు అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన తీరుపై మాక్‌డ్రిల్‌ చేశారు.

13/20

విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రం.. రాజకీయ రణక్షేత్రంగా మారిపోయింది. డిసెంబరు 29న ఈ దేవాలయంలో రాముడి విగ్రహం ధ్వంసమైన నేపథ్యంలో ఇవాళ తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. చంద్రబాబు కంటే ముందే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

14/20

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థిస్తూ నాదనీరాజనం వేదికపై సుందరకాండ అఖండ పారాయణం చేశారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతి వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేద పారాయణులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు.

15/20

కరోనా టీకా పంపిణీలో భాగంగా కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శనివారం డ్రైరన్‌ నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని అమరావతి రోడ్డులో ఉన్న ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో డ్రైరన్‌ చిత్రాలు ఇవి.

16/20

కేజ్‌ వీల్‌ ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే రహదారులు దెబ్బతింటున్నాయని.. కాబట్టి వాటిని రోడ్లపై తిప్పవద్దని అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా మాధవ నగర్‌కు చెందిన ఓ రైతు రూ.1.20 లక్షలు ఖర్చు చేసి కేజ్‌ వీల్‌ ట్రాక్టర్లను సులువుగా మోసుకెళ్లేలా ట్రాక్టరుకు ఒక ట్రాలీ తయారు చేయించారు.

17/20

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న అర్లి(టి)కి సమీపంలో ఓ చిన్న గ్రామం ఉంది. ఇక్కడ గత మూడు నెలలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రామస్థులు చలిమంటలు కాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

18/20

తిరుమల జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలోని విద్యుత్‌శాఖ భవంతిలో ఏడడుగుల భారీ నాగుపాము కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని చాకచక్యంగా నాగును పట్టుకున్నారు.

19/20

వీరంతా నల్గొండ జిల్లా శౌలిగౌరారం ప్రాజెక్టు ఆయకట్టు కింద వరినాట్లు వేసేందుకు వచ్చిన మహిళా కూలీలు. నూతన సంవత్సరం సందర్భంగా పొలంలోనే ఇలా వేడుకలు జరుపుకొన్నారు.

20/20

సాధారణంగా కొబ్బరిచెట్లు నిటారుగా పెరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కోలంక గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ కొబ్బరిచెట్టు చివరి భాగం తొమ్మిది భాగాలుగా విడిపోయింది. తొమ్మిది తలలకూ కాయలు కాస్తుండడం విశేషం.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని