‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/14

స్కాట్లాండ్ గ్లాస్గోలోని క్వీన్స్‌ పార్క్‌లో గడ్డకట్టిన సరస్సుపై గ్రెగ్‌ స్కాట్‌ తన రెండేళ్ల కూతురును ఇలా తీసుకెళ్తూ కనిపించారు.

2/14

ప్రస్తుతం నగదు లావాదేవీలన్నీ చరవాణుల్లోనే చేస్తున్నారు. పంజాగుట్ట కూడలిలో ఓ యువతి ఆటో ఛార్జీలను డ్రైవర్ ఫోన్‌ నంబర్‌కు బదిలీ చేస్తూ ఇలా కనిపించింది.

3/14

శ్రీనగర్‌లో దట్టంగా కురిసిన మంచును ముద్దలుగా చేసి ఒకరిపై ఒకరు చల్లుకుంటున్న స్థానిక చిన్నారులు

4/14

నిరుద్యోగులు, రైతులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం నిరాహారదీక్ష చేపట్టారు. ఎంజే మార్కెట్‌లోని తెజస కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

5/14

కోల్‌కతాలో గుర్రంపై వెళ్తున్న ఓ వ్యక్తి, అంబాసిడర్‌ కారు పక్కపక్కనే కనిపించాయి. ఇది చూసిన కొందరు వృద్ధులు పాత రోజుల్లో గుర్రపు బండ్లు, అంబాసిడర్‌ కార్లు ఎక్కువ ఉండేవని గుర్తు చేసుకున్నారు.

6/14

రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌, ‘హెచ్‌’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వద్ద కొవిడ్‌పై అవగాహన కల్పిస్తూ 10K రన్‌ నిర్వహించారు. కొత్త కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ sms (శానిటైజర్‌, మాస్క్‌, సోషల్ డిస్టన్స్‌)ను జీవితంలో భాగం చేసుకోవాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

7/14

బజరంగీ భాయ్‌జాన్ చిత్రంలోని ‘కుఛ్‌ తో బతా జిందగీ.. అప్‌నా పతా జిందగీ’ పాటను తన కొడుకు రియోతో కలిసి ఆస్వాదిస్తున్న వీడియోను క్రికెటర్‌ సురేశ్ రైనా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ‘పిల్లల మనసులు చాలా అమాయకమైనవి.. వారి వద్ద మన ప్రతి బాధకు సమాధానం దొరుకుతుంది’ అనే వ్యాఖ్యను ఆయన జోడించారు.

8/14

సమావేశాలు, సభల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉండే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలోని పెద్ద చేపల మార్కెట్లో సందడి చేశారు. ఓ వ్యాపారితో కాసేపు సంభాషించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు నచ్చిన చేపను పరిశీలనగా చూసి ఎంత ధర పలుకుతుందని ఆరా తీశారు.

9/14

ఫ్లోరిడా పరిధిలోని బ్రాడెంటన్‌లో స్థానికులు కార్లలో వచ్చి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుని వెళుతున్న దృశ్యాలివి. గతంలో కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు కూడా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని అవలంబించారు.

10/14

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో శనివారం కొవిడ్‌ టీకా డ్రైరన్‌ నిర్వహించారు. టీకా ఇచ్చే తీరును వైద్య సిబ్బంది తమ చరవాణిలో పదిలంగా బంధించారు.

11/14

హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లోని ఓ రావిచెట్టు నిండా పండ్లు విరగకాశాయి.దీంతో చెట్టు కొమ్మలపై కోయిలలు చేరి వాటిని ఆరగిస్తున్నాయి. కమ్మగా రాగాలు తీస్తున్నాయి.

12/14

చాయ్‌ పార్సిల్‌ చేయాలంటే ఎక్కువగా థర్మస్‌ప్లాస్క్‌ను ఉపయోగిస్తారు. కానీ మంచిర్యాలకు చెందిన హోటల్‌ నిర్వాహకుడు గోపాల్‌ వినూత్నంగా ఆలోచించి చాయ్‌ పార్సిల్‌ కోసం ప్రత్యేకంగా డబ్బాలను తయారు చేయించారు. చాయ్‌ వేడి తగ్గకుండా ఉండేందుకు డబ్బా లోపల సిల్వర్‌ కోటింగ్‌ కవర్‌తో బయట అట్ట డబ్బా ఉండేలా రూపొందించారు. పది చాయలు పట్టే ఈ డబ్బా ఒకసారి మాత్రమే వాడుకోవచ్చు. ఒక్కో డబ్బా తయారీకి రూ.20 ఖర్చయిందని చెబుతున్నారు. -న్యూస్‌టుడే, మంచిర్యాల అర్బన్‌

13/14

చూడడానికి ఎండుటాకులా కనిపిస్తున్న ఇది సీతాకోక చిలుక వంటి కీటకం. హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో కనిపించింది. దీనిపేరు ‘బ్రౌన్‌ లాప్పెడ్‌ మోత్‌’ అని.. శ్రీలంక, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఇరాక్‌ దేశాల్లో ఎక్కువగా ఉండే ఈ కీటకాలు.. మన దేశంలో అరుదుగా కనిపిస్తాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీనివాస్‌ వివరించారు. ఇది ఆహారం కోసం రాత్రి పూట మాత్రమే బయటకు (నిశాచర జీవి) వస్తుందని, చిన్న చిన్న పురుగులను ఆహారంగా తింటుందని తెలిపారు. రెక్కలు తెరుచుకున్నప్పుడు నలుపు, గోధుమ రంగుల్లో కనిపిస్తుందని వెల్లడించారు. - ఈనాడు, హైదరాబాద్‌

14/14

శనివారం విపరీతమైన మంచు కురవడంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్‌ - స్పుతి వద్ద అటల్‌ సొరంగం దక్షిణ ద్వారం వైపు ట్రాఫిక్‌ స్తంభించి ఆగిపోయిన పర్యటకుల వాహనాలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని