ముఖ్యమంత్రే కంగనకు పరిహారం ఇవ్వాలి: భాజపా

తాజా వార్తలు

Published : 27/11/2020 21:09 IST

ముఖ్యమంత్రే కంగనకు పరిహారం ఇవ్వాలి: భాజపా

ముంబయి: కక్ష సాధింపులో భాగంగానే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేశారంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ భాజపా మహారాష్ట్ర సర్కార్‌పై విమర్శలకు దిగింది. ‘కంగన ఇంటిని కూల్చివేయడం దరుద్దేశపూరితంగా జరిగింది. ఆమెకు చెల్లించాల్సిన పరిహారం గురించి కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టుగా బీఎంసీ నడుచుకుంది. ఈ సమస్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలి. ఆమెకు, బీఎంసీ న్యాయవాదులకు చెల్లించే సొమ్మును మొత్తం ముఖ్యమంత్రే చెల్లించాలి. ఆ సొమ్ము ప్రజలది కాకూడదు’ అంటూ భాజపా నేత అతుల్‌ భత్కాల్కర్ వ్యాఖ్యానించారు.  

కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో కంగనా రనౌత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముదిరిన మాటల వివాదం..ఆమె బంగ్లా కూల్చివేతకు దారితీసిన విషయం తెలిసిందే. బీఎంసీ చర్యను ఖండిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించగా.. నేడు కంగనకు అనుకూలంగా తీర్పు వెలువడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని