సీఎంని మార్చే ప్రసక్తే లేదు: కర్ణాటక భాజపా

తాజా వార్తలు

Published : 22/10/2020 01:17 IST

సీఎంని మార్చే ప్రసక్తే లేదు: కర్ణాటక భాజపా

బెంగళూరు: కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పూ ఉండదని, ముఖ్యమంత్రి యడియూరప్ప నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర భాజపా స్పష్టంచేసింది. యడియూరప్ప ఎంతోకాలం సీఎంగా కొనసాగరంటూ భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలతో పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ స్పందించారు. రాష్ట్రంలో సీఎంని మార్చే ప్రసక్తేలేదన్నారు. మూడేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా యడియూరప్ప నాయకత్వంలోనే ఎదుర్కొంటామని ట్విటర్‌లో పేర్కొంటూ ఊహాగానాలకు తెరదించారు. పూర్తికాలం పాటు సీఎంగా యడియూరప్పే కొనసాగుతారని స్పష్టంచేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కర్ణాటకలో సీఎంగా యడియూరప్ప ఎంతో కాలం ఉండబోరని బసనగౌడ సోమవారం వ్యాఖ్యానించారు. తదుపరి సీఎంగా ఉత్తర కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ నిర్ణయించిందంటూ పేర్కొన్నారు. అలాగే, అన్ని అభివృద్ధి పనులు తన సొంత జిల్లా శివమొగ్గకే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అయితే, బసనగౌడ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు యడియూరప్ప ఇష్టపడలేదు. తర్వాత ఆయనతో మాట్లాడతానని చెప్పారు. బసనగౌడ వ్యాఖ్యలపై భాజాపా నేతలు మండిపడుతున్నారు. ఆయన్ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని