నాకు కరోనా అంటించాలని చూస్తున్నారు!

తాజా వార్తలు

Updated : 26/09/2020 15:53 IST

నాకు కరోనా అంటించాలని చూస్తున్నారు!

ఏపీ సర్కార్‌పై వైకాపా ఎంపీ సంచలన వ్యాఖ్యలు

దిల్లీ: ఏపీ ప్రభుత్వంపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై కరోనా కేసు పెట్టి.. కరోనా అంటించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ పెద్దల చర్యలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కొందరు ఆలయాలు, తన కార్యాలయంపై దాడులకు ప్రయత్నిస్తున్నారనీ..  రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆవేశంలో మాట్లాడితే తనపై కేసులు పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

మత మార్పిడిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, అందుకోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. సాక్షాత్తు చర్చి పాస్టర్లు కూడా హిందూ ధ్రువపత్రంతో ఉన్నారన్నారు. ప్రజలు ఎంత విజ్ఞులో ఓట్లు వేసే సమయంలో బయటపడుతుందని, ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు పడాలంటే ప్రజలను గిల్లటం ఆపాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని