ఒక్కరికోసం తిరుమల సంప్రదాయాలు మార్చడమా?

తాజా వార్తలు

Published : 20/09/2020 00:44 IST

ఒక్కరికోసం తిరుమల సంప్రదాయాలు మార్చడమా?

లోక్‌సభలో ప్రశ్నించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ  రఘురామకృష్ణరాజు లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త  గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్‌ వేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఎంతో విశిష్ఠ చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మిగతా వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు.

అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అంతకముందు దిల్లీలో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. ఆలయనిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని