నాకూ నోటీసులు అందాయ్‌‌: శరద్‌ పవార్‌ 

తాజా వార్తలు

Published : 23/09/2020 01:16 IST

నాకూ నోటీసులు అందాయ్‌‌: శరద్‌ పవార్‌ 

ముంబయి: ఆదాయ పన్ను శాఖ తనకు కూడా నోటీసులు పంపిందని ఎన్సీపీ అధినేత, రాజ్యసభ సభ్యుడు శరద్‌ పవార్‌ తెలిపారు.  గతంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లపై కొన్ని వివరణలు కోరుతూ నిన్న ఈ నోటీసులు తనకు అందాయని విలేకర్లతో అన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, తన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేకు సైతం ఐటీ శాఖ ఇలాంటి నోటీసే పంపిందని చెప్పారు. వాళ్లు (కేంద్రం) కొందరి పట్ల ప్రేమ చూపిస్తున్నారంటూ పవార్‌ వ్యాఖ్యానించారు. ఈ అఫిడవిట్‌లకు సంబంధించి కొన్ని వివరణలు, ధ్రువీకరణల గురించి ఐటీశాఖ అడిగిందనీ.. నోటీసులకు సమాధానం చెబుతామన్నారు. 

ఆ ఎంపీలకు సంఘీభావంగా ఈ రోజు ఏమీ తినను

మరోవైపు, వ్యవసాయ బిల్లుల ఆమోదం నేపథ్యంలో రాజ్యసభలో రణరంగానికి కారణమై సస్పెండైన ఎనిమిది మంది ఎంపీలకు పవార్‌ సంఘీభావం ప్రకటించారు. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు తెలిపారు. వారికి సంఘీభావంగా ఈ రోజు తానేమీ తినబోనని పవార్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఈ రకంగా బిల్లులు ఆమోదం పొందడం తానెప్పుడూ చూడలేదన్నారు. కేంద్రం త్వరగా ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవాలనుకుందని, సభ్యులకు దీనిపై ప్రశ్నలు ఉన్నా.. ప్రభుత్వం మాత్రం చర్చకు సిద్ధంగా లేదన్నారు.  వారు అడిగిన ప్రశ్నలపై ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే వారంతా వెల్‌లోకి వచ్చారన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేయడంతో వారందరినీ సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ కూడా సభా నిబంధనలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని