న్యాయస్థానాలపై వైకాపా తీరు సరికాదు:సోమిరెడ్డి

తాజా వార్తలు

Published : 12/10/2020 01:21 IST

న్యాయస్థానాలపై వైకాపా తీరు సరికాదు:సోమిరెడ్డి

రేణిగుంట: చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా న్యాయస్థానాలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్న ప్రభుత్వం వైకాపాయేనని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో తెదేపా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై వైకాపా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం విడుదల చేసినా క్షేత్రస్థాయిలో వాటిని అందించకపోవటంపై ఆయన మండిపడ్డారు. ఇదే విషయమై ప్రజలు పడుతున్న కష్టాలు తెలియజేసేలా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పదివేల ఉత్తరాలు రాయనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని