‘ప్రత్యేకహోదాపై గళమెత్తాలని జగన్‌ చెప్పారు’

తాజా వార్తలు

Updated : 14/09/2020 19:29 IST

‘ప్రత్యేకహోదాపై గళమెత్తాలని జగన్‌ చెప్పారు’

వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి

దిల్లీ: పార్లమెంటులో ప్రత్యేకహోదా అంశంపై మాట్లాడాలని వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌ తమకు సూచించినట్లు ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి పోలవరం బకాయిలతో పాటు నిర్వాసితులకు పరిహారం వచ్చేలా చూడాలని తమకు సీఎం చెప్పినట్లు ఆయన వివరించారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు.

సమావేశం అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా, పోలవరం పెండింగ్‌ నిధులు సహా వివిధ అంశాలపై కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలపైనా అధికారులతో మాట్లాడతామన్నారు. గరీబ్‌కల్యాణ్‌ కింద రాష్ట్రానికి నిధులు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని.. ప్రతి పార్లమెంటు స్థానంలో వైద్యకళాశాల ఏర్పాటుకు సహకారం కోరతామని మిథున్‌రెడ్డి వివరించారు. ఏపీ శాసన మండలి రద్దు, దిశ బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రతిపక్షాల అజెండా మేరకు నడుస్తున్నారని.. ఆయనపై లోక్‌సభ స్పీకర్‌ అనర్హత వేటు వేయాలని కోరారు. రఘురామకృష్ణరాజును తాము సస్పెండ్‌ చేయబోమంటూ ఓ ప్రశ్నకు మిథున్‌రెడ్డి సమాధానమిచ్చారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని