UP Assembly polls: ఆ పార్టీతో పొత్తే తొలి ప్రాధాన్యం.. అలాగని..!: శివపాల్‌ యాదవ్‌

తాజా వార్తలు

Published : 13/10/2021 17:41 IST

UP Assembly polls: ఆ పార్టీతో పొత్తే తొలి ప్రాధాన్యం.. అలాగని..!: శివపాల్‌ యాదవ్‌

ఆగ్రా: వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు కార్య రంగం సిద్ధంచేసుకుంటున్నాయి. పొత్తులు, రాజకీయ వ్యూహాలు, కొత్త ఎత్తులతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కదన రంగంలోకి దూకుతున్నాయి. బృందావన్‌లో సామాజిక పరివర్తన రథయాత్రను మంగళవారం ప్రారంభించిన ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ నేత, ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు ఏర్పరచుకోవడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. అలాగని, యూపీలో భాజపాను ఓడించేందుకు ఇతర సెక్యులర్‌ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడాన్ని కూడా కొట్టిపారేయలేమన్నారు. బృందావన్‌లో మంగళవారం మొదలైన సామాజిక్‌ పరివర్తన్‌ రథ్‌ యాత్ర 75 జిల్లాలను కలుపుతూ చివరకు రామజన్మభూమి అయిన పవిత్ర స్థలం అయోధ్యలో ముగుస్తుందన్నారు. సమాజ్‌వాదీ పార్టీకే తమ తొలి ప్రాధాన్యమన్న ఆయన.. భాజపాను ఓడించేందుకు సెక్యులర్‌ పార్టీలతో కలిసేందుకు సిద్ధమేనన్నారు.

యూపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ద్రవ్యోల్బణం నియంత్రణ, అవినీతిని అంతం చేయడం, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెనక్కి తీసుకురావడం, రైతుల ఆదాయం రెట్టింపు, చైనా ఆక్రమించిన భూమిని వెనక్కి తేవడం వంటి అనేక  హామీలను నెరవేర్చలేదన్నారు. సామాజిక్‌ పరివర్తన్‌ రథ్‌యాత్ర సందర్భంగా ఇలాంటి అనేక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 2022లో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే హామీలన్నింటినీ నెరవేరుస్తామని వ్యాఖ్యానించారు.  2018లో సమాజ్‌వాదీ పార్టీలో అఖిలేశ్‌ యాదవ్‌తో విభేదాలతో బయటకు వచ్చిన శివపాల్‌ యాదవ్‌.. ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని