యడియూరప్పకు 65 మంది ఎమ్మెల్యేల మద్దతు

తాజా వార్తలు

Updated : 08/06/2021 04:56 IST

యడియూరప్పకు 65 మంది ఎమ్మెల్యేల మద్దతు

నాయకత్వ మార్పుపై పార్టీ యోచించడంలేదన్న ప్రహ్లాద్‌ జోషి
మే 2023 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారన్న నళిన్‌ కతీల్‌

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పునకు భాజపా యోచిస్తోందన్న ఊహాగాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు 65 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు.  ఈ మేరకు  ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య సోమవారం వెల్లడించారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల గురించి తాను కర్ణాటక ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌తో చర్చించినట్లు తెలిపారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా కర్ణాటక అధ్యక్షుడు నళిన్‌ కతీల్‌ సైతం నాయకత్వ మార్పు అంశాన్ని కొట్టిపారేశారని వివరించారు. 

యడియూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే ఆలోచన పార్టీకి లేదని ప్రహ్లాద్‌ జోషి  ఆదివారం హుబ్బళ్లిలో విలేకరుల సమక్షంలో స్పష్టం చేశారు. కొవిడ్‌ నియంత్రణపై మాత్రమే ప్రస్తుతం పార్టీ దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను నళిన్‌ కతీల్‌ తోసిపుచ్చారు. ఏ స్థాయిలోనూ పార్టీ ఈ అంశంపై చర్చించలేదని మంగుళూరులో మీడియాకు తెలిపారు.  పరిపాలనలో ఆయనకు అపార అనుభవం ఉందన్నారు. 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు. 

అంతకుముందు యడియూరప్ప మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. దానిని నేను సద్వినియోగం చేసుకుంటాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి స్పందించను. పార్టీ ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం. రాష్ట్రంలో సమర్థులైన నాయకులు ఉన్నారు’’ అని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని