ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలి:సోము

తాజా వార్తలు

Published : 22/04/2021 01:30 IST

ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలి:సోము

అమరావతి: ఏపీలో కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థులు పరీక్షలకు ప్రజా రవాణా ద్వారానే రావాల్సి ఉంటుందని వివరించారు. దీని వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. అందువల్ల పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నానన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాధిగ్రస్తుల చికిత్స, ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.

కొందరు లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు నిలుపులేకపోతున్నారని.. రోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సోము వీర్రాజు అన్నారు. కొవిడ్‌ వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్‌ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని లేఖలో సోము కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని