ఏపీ: ‘ఎమ్మెల్సీ’లను నామినేట్‌ చేసిన గవర్నర్‌
close

తాజా వార్తలు

Published : 29/07/2020 00:54 IST

ఏపీ: ‘ఎమ్మెల్సీ’లను నామినేట్‌ చేసిన గవర్నర్‌

అమరావతి: గవర్నర్‌ నామినేట్‌ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వారిని నామినేట్‌ చేయాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం సిఫార్సుల మేరకు జకియా ఖానం, పాండుల రవీంద్రబాబును ఎమ్మెల్సీలుగా గవర్నర్‌ నామినేట్‌ చేశారు. గతంలో కంతేటి సత్యనారాయణ రాజు, టి. రత్నభాయిలు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు ఉండగా.. వారి పదవీకాలం మార్చిలోనే ముగిసింది. దీంతో వారి స్థానాల్లో తాజాగా జకియా ఖానం, రవీంద్రబాబును గవర్నర్‌ నామినేట్‌ చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని